బాహుబలి ది కంక్లూజన్ మూవీ.. దేశంలోనే అత్యధికంగా ఆసక్తి కలిగిస్తున్న సినిమా అనే సంగతి ముందే వెల్లడైంది. 10 రోజుల క్రితం థియేట్రికల్ ట్రైలర్ ఇచ్చిన తర్వాత.. జనాల ఆసక్తి మరింతగా పెరిగిపోయింది. 100 మిలియన్ల వ్యూస్ తో సెన్సేషనల్ రికార్డ్ సృష్టించిన బాహుబలి2.. ఇప్పుడు ఏప్రిల్ 28 రిలీజ్ కోసం రెడీ అయిపోతోంది.
ట్రైలర్ కట్ చేసేందుకే బోలెడంత కసరత్తు చేశాడు రాజమౌళి. ఇప్పుడు ఫైనల్ ఔట్ పుట్ కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ముఖ్యంగా బాహబలి టీం అంతా ఎడిట్ రూమ్ విషయంలో బాగా ఎలర్ట్ గా ఉన్నారు. బాహుబలి విషయంలో జరిగిన పొరపాటు మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఎడిటింగ్ చేయిస్తున్న ప్రాంతాలను సెక్యూరిటీ సర్వైలెన్స్ లో పెట్టేశారు. సీసీటీవీ కెమేరాలను అమర్చి.. ప్రతీ క్షణాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు . అంతే కాదు.. ఎడిట్ రూమ్ లోకి వెళ్లేటపుడు.. బయటకు వచ్చేటపుడు క్షుణ్ణంగా పరిశీలించి కానీ వదలడం లేదు.
మొబైల్ ఫోన్లు.. డిజిటల్ పరికరాల వాడకాన్ని కంప్లీట్ గా నిషేధించేశారు కూడా. బాహుబలి2 గురించి చిన్న లీక్ కూడా జరగకుండా ఉండేందుకు.. జక్కన్న అండ్ కో తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే.. ఈ స్థాయి సినిమాకు ఈ మాత్రం అవసరమేలే అనిపించక మానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/