ఇన్నాళ్లూ బాక్సాఫీసు దగ్గర రికార్డులతో అదరగొట్టిన బాహుబలి ఇప్పుడు రివార్డులు - అవార్డులు అందుకొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. పలు ప్రయివేట్ సంస్థలు ఇప్పటికే బాహుబలికి పురస్కారాల్ని ప్రకటించాయి. భవిష్యత్తులో ఆ ఉధృతి మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. నటీనటులతో పాటు సాంకేతిక బృందం కూడా విశేషంగా పనిచేసి ఆ చిత్రాన్ని రూపొందించింది. ఆ ప్రతిభంతా తెరపై కనిపించింది. ఆ లెక్కన కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల్లో బాహుబలి ఈసారి భారీగా కొల్లగొట్టే అవకాశముంది. ఆలోపుగానే ఓ రౌండ్ ప్రైవేట్ అవార్డుల్ని బాహుబలి కొల్లగొట్టేయబోతోంది. తాజాగా గామా గల్ఫ్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డ్స్ సంస్థ బాహుబలికి ప్రత్యేక పురస్కారాన్ని ప్రకటించింది. గామా ప్రతీ యేట మ్యూజిక్ కి సంబంధించి మాత్రమే పురస్కారాల్ని ఇస్తోంది.
అయితే ఈసారి బాహుబలి సినిమాకిగానూ ప్రత్యేకమైన పురస్కారాన్ని ప్రకటించింది. ఫిబ్రవరి 12న దుబాయ్ లో జరిగే గామా పురస్కారాల వేడుకకి ప్రభాస్ - రానా మొదలుకొని బాహుబలి టీమ్ మొత్తం హాజరు కానుంది. ఈసారి కృష్ణంరాజుకి లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ పురస్కారాన్ని ప్రకటించారు. తన పెదనాన్నకి లైఫ్ టైమ్ అవార్డు ఇస్తున్నారు కాబట్టి ప్రభాస్ తప్పకుండా హాజరయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బాహుబలి 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. గామాలో బాహుబలి టీమ్ తోపాటు కంచె టీమ్ కూడా పాల్గొంటోందట. ఈ రెండు సినిమాలు కూడా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కినవే. యుద్ధాలు చేసిన రెండు చిత్రబృందాలు కలిసి వేదికపైకొస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది.