ఏప్రిల్ 7నే బాహుబలి రిలీజ్

Update: 2017-04-05 17:51 GMT
అదేంటీ.. ఏప్రిల్ 28న కదా బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ డేట్ ఇచ్చారు అనే కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదు. బాహుబలి2 రిలీజ్ కచ్చితంగా ఏప్రిల్ 28నే. కాకపోతే ఏప్రిల్ 7న బాహుబలి మొదటి భాగం మళ్లీ రిలీజ్ అవుతోందంతే.

కాకపోతే ఇదేమీ తెలుగు వెర్షన్ రిలీజ్ కాదు. హిందీ బాహుబలి ది బిగినింగ్ ను.. ఆ వెర్షన్ ను నిర్మాత కరణ్ జోహార్ మరోసారి విడుదల చేస్తున్నాడు. ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడమే కాదు.. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా ఇప్పటికే వదిలేశాడు. బాహుబలి రిరిలీజ్ అంటూ వేసిన పోస్టర్లు ఇప్పటికే హంగామా చేసేస్తున్నాయి. మరో మూడు వారాల్లో బాహుబలి రెండో పార్ట్ విడుదల అవుతుండడంతో.. దేశమంతా ఇప్పటికే బాహుబలి ఫీవర్ అలముకుంది.

సినిమాపై అసక్తి అమాంతం పెరిగిపోతోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కరణ్ జోహార్.. కరెక్ట్ గా టైం చూసి.. బాహుబలి పార్ట్ 1 ను జనాలపైకి వదులుతున్నాడు. ఒకవైపు రెండో భాగానికి కావాల్సినంత ప్రచారం వస్తుంది.. మరోవైపు ఇప్పుడు రాబోయే వసూళ్లు అదనంగా జేబులో వేసుకునే అవకాశం ఉంటుంది. ప్రొడ్యూసర్ గా కరణ్ జోహార్ తెలివితేటలు ఏంటో తెలిసేందుకు ఈ ఒక్క ఇన్సిడెంట్ సరిపోతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News