బాహుబలి ఇప్పుడు ప్రపంచ జైత్రయాత్ర చేస్తోంది. బాహుబలి టీమ్ ఎక్కడుకు వెళ్ళిన అక్కడ ఇచ్చే ప్రేమ గౌరవం మాటల్లో చెప్పలేనిది. రాజమౌళి ఇప్పుడు లండన్ లో సినిమాను ప్రమోట్ చేయడంలో బాగా బిజీగా ఉన్నారు. అందులో బాగంగా బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఇండియన్ ఫిల్మ్ సీజన్లో బాహుబలికి స్పెషల్ షో వేశారు. దానిలో రాజమౌలితో పాటు అనుష్క కీరవాణి శోబు కూడా పాల్గొన్నారు.
ఇక సినిమా పూర్తయ్యాక.. అక్కడి ప్రేక్షకులు అంతా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ వారికి గౌరవం తెలిపారు. అదే అసలు సిసలైన విజయం. ప్రేక్షకులు ప్రశ్నకు అక్కడ ఉన్న అనుష్క సమాధానం చెప్పుతూ “రాజమౌళి నాకు కథ చెప్పిన తీరు ఆ రోజుని ఎప్పటికీ మరిచిపోలేను. నేను అక్కడే అలా మాటలకుండా కన్నీళ్లు పెట్టుకొన్న. సినిమా చూసినప్పుడు మీరు కంటతడి పెట్టుకున్నట్లు.” రాజమౌళి మాట్లాడుతూ “ఈ కథ మా నాన్నగారు చెప్పినప్పుడు ఆ కథలో పాత్రలు ఉన్న విధానం నన్ను ఈ సినిమా చేసే శక్తినిచ్చింది.” నిర్మాత శోబు మాట్లాడుతూ “ఈ సినిమా లో ఎమోషన్ ఇండియా రూట్స్ నుండి వచ్చినివి. అందుకే ఇంత పెద్ద కాన్వాస్ పై చెప్పే వీలుపడింది, నేను ఇంత పెద్ద సక్సెస్ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు” సంగీత ధర్శకుడు కీరవాణి చెప్పుతూ “రాజమౌళి నా చేత ప్రపంచ స్థాయీ సంగీతం చేయించాడు అందుకు ఎప్పుడు ఋణపడి ఉంటాను అన్నారు.”
BFI హెడ్ రాబిన్ బాకర్ మాట్లాడుతూ ఇండియన్ కల్చర్ సీజన్ ఏప్రిల్ నుండి డిసెంబర్ వరుకు జరుగుతాయి అనిచెప్పారు. మొత్తానికి తెలుగు సత్తా బ్రిటిష్ వారికి వినపడేలా అందరూ గుర్తించేలా చేసిన రాజమౌళి కి మనం అందరం గౌరవసత్కారము చేయవలిసిందే.. ఏమంటారు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/