ఈ అమ్మకాల్లో బాహుబలి రికార్డులేగా..!!

Update: 2016-10-22 13:30 GMT
బాహుబలి ది కంక్లూజన్ కోసం అభిమానులంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అందుకే ఆడియన్స్ కి మరింత థ్రిల్లింగ్ కలిగించడానికి.. వారు బాహుబలి వ్యూయింగ్ ఎక్స్ పీరియన్స్ ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి.. బాహుబలి టీం కొత్త ఐడియా వేసింది. టెక్నాలజీ బేస్ చేసుకుని అద్భుతమైన విజువల్స్ చూపిస్తున్న బాహుబలి యూనిట్.. ఇప్పుడు ప్రత్యేకమైన వర్చువల్ రియాలిటీ ని కూడా పరిచయం చేస్తోంది.

వర్చువల్ రియాలిటీ.. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటూ స్క్రీన్ పై చూసేవాటిని రియల్ లైఫ్ లో ఉన్నట్లుగా చూపించే విధంగా టెక్నాలజీ ఇప్పుడు బాగా ఊపందుకుంటోంది. దీన్ని ఉపయోగించుకుంటున్న బాహుబలి టీం.. వీఆర్ కార్డ్ బోర్డ్స్ ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. గూగుల్ కార్డ్ బోర్డ్ ఇన్ స్పిరేషన్ తో రూపొందిన ఈ టెక్నాలజీతో.. ప్రత్యేకంగా రూపొందిన ఈ కార్డ్ బోర్డ్ లను మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. ఒక్కో కార్డ్ బోర్డ్ 349రూపాయలకు వాళ్లే అమ్మేస్తున్నారు కూడా.

బాహుబలి2 ఫస్ట్ లుక్ లాంఛింగ్ సందర్భంగా ముంబై మామి ఫెస్టివల్ లో.. వర్చువల్ రియాలిటీ జోన్ ను ఏర్పాటు చేసి.. బాహుబలి వీఆర్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిచయం చేస్తున్నారు. ఈ కార్డ్ బోర్డ్ ల తయారీకి బాగా తక్కువ ఖర్చే అవుతుంది కానీ.. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ టెక్నాలజీ రిటైల్ యూజర్లకు మాత్రం బాగా కాస్ట్ లీ. బాహుబలి సెట్స్ పై జరుగుతున్నది చూడచ్చంటూ.. ఆ వర్చువల్ రియాలిటీ కార్డ్  బోర్డుల అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో జరిగి.. బాహుబలి రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News