దర్శకధీరుడు తెరకెక్కించిన `బాహుబలి` సిరీస్ చిత్రాలతో స్టార్ నైటర్ విజయేంద్రప్రసాద్ పేరు మారుమ్రోగిపోయింది. ఈ సినిమాలతో దేశ వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల్లోనూ విజయేంద్ర ప్రసాద్ పాపులర్ అయ్యారు. ఇక తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ సల్మాన్ ఖాన్ నటించిన `బజరంగీ భాయిజాన్, కంగన రనౌత్ నటించిన `మణికర్ణిక` వంటి సినిమాలతో బాలీవుడ్ లోనూ తన కంటూ ప్రత్యేక గుర్తింపుని, స్టార్ రైటర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్నారు.
`సమరసింహారెడ్డి`తో తెలుగు నాట సీమ కథలకు శ్రీకారం చుట్టిన ఆయన ట్రెండ్ సెట్ చేశారు. రాజమౌళి తెరకెక్కించిన సింహాద్ర, యమదొంగ, మగధీర వంటి చిత్రాలకు కథలు అందించి తెలుగులో తిరుగులేని రచయితగా గుర్తింపుని పొందారు.
తలైవి, మెర్సల్ వంటి తమిళ చిత్రాలకు సైతం కథలు అందించిన అక్కడ కూడా తన సత్తాని చాటారు. తెలుగు సినిమాకు విజయేంద్ర ప్రసాద్ చేసిన సేవలకు గానూ ఆయనని కేంద్రలో వున్న బీజేపీ ప్రభుత్వం రాజ్య సభకు నామినేట్ చేసింది.
స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ పేరుని సిఫారసు చేయడం విశేషం. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు విజయేంద్ర ప్రసాద్ ను ఏపీ నుంచి నామినేట్ చేశారు. సోమవారం సీతాకాల సమావేశాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ నుంచి విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, కె.వి. విజయేంద్ర ప్రసాద్ ఎంపీలుగా పార్లమెంట్ హాలులో ప్రామాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా కె.వి. విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రపతి కోటాలో నేను ఎంపీగా నామినేట్ కావడం సంతోషంగా వుంది. రాజ్యసభకు వస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. నా కథలే నన్ను రాజ్యసభకు తీసుకొచ్చాయి. రాజ్యసభకు నామినేట్ కావడం నా బాధ్యతల్ని మరింతగా పెంచింది.
ప్రజల సమస్యలను రాజ్యసభ దృష్టికి తీసుకెళ్తా` అని తెలిపారు. అయితే విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు నామినేట్ కావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాజమౌళికి తండ్రివి కాబట్టే ఎంపీని చేశారని విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై విజయేంద్రప్రసాద్ ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.