సండే సాయంత్రం.. సినిమా లవర్స్ కు మాంచి కిక్కిచ్చే టైమ్. ఎందుకంటే టివిల్లో మాంచి కొత్త సినిమాలు వేస్తుంటారు. అయితే ఈ సండే మాత్రం.. ''బాబు బంగారం'' పాటలు రావడంతో.. చాలామంది వాటిని వింటూ ఎలా ఉన్నాయో ఫీలయ్యే పనిలో పడ్డారు. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ ఈ సినిమా పాటల గురించి ఏమంటున్నారంటే..
గతంలో రన్ రాజా రన్ - జిల్ వంటి సినిమాలకు సంగీతం అందించిన జిబ్రాన్.. బాబూ బంగారం సినిమాకు కూడా మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా పాటల్లో అతగాడి క్లాసికల్ మ్యూజిక్ మార్క్ కనిపిస్తోంది. ముఖ్యంగా మల్లలె వానల అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ అయితే ఆల్బమ్ కే హైలైట్. ఇక స్నేహితుడో.. బాబూ బంగారం (టైటిల్ సాంగ్).. రాక రాక అంటూ సాగే పాటలు బాగున్నాయి. అలాగే దిల్లున్న వాడే అంటూ సాగే హీరోయిజం సాంగు కూడా అదిరిపోయింది. ముఖ్యంగా ప్రతీ పాటలోనూ కొత్త వాయిద్యాలను వింటున్నట్లు సౌండ్ చాలా కొత్తగా ఉంది. ఇక బాబూ బంగారం థీమ్ మ్యూజిక్ కూడా కేక అనే చెప్పాలి. మొత్తానికి సాఫ్టు మెలోడీలా సాగే ఈ ఆల్బమ్ అంతా ఒక రేంజులో ఉంది.
ఇక సినిమాలోని ఒక పాటను మాత్రం దర్శకుడు మారుతి ఫేవరేట్ కంపోజర్ జె.బి. కంపోజ్ చేశాడు. ఇది రొటీన్ మాస్ సాంగ్. మారుతి డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ - నయనతార జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.