తెలుగులో ‘బిగ్ బాస్’ సీజన్ 2 కార్యక్రమం తాజాగా పూర్తి అయిన విషయం తెల్సిందే. సాదారణ బుల్లితెర నటుడిగా ఎంట్రీ ఇచ్చిన కౌశల్ అంతా అనుకున్నట్టుగానే ఈ షో విజేతగా నిలిచాడు. మొదట్లో అంత ఫేం లేని కౌశల్ కేవలం కొన్ని రోజుల్లోనే విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇంట్లో ఈయన తీరు నచ్చని వారు చాలామంది ఎన్ని కుట్రలు చేసినా కూడా కౌశల్ మొదటి నుండి తను చెబుతున్నట్టుగానే గేమ్ ఆడడానికే వచ్చాను - గేమే ఆడుతాను అని చివరికి విజేతగా నిలిచాడు. ‘బిగ్ బాస్’ విజేతగా నిలిచిన కౌశల్ ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు కానీ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న తోటి కంటెస్టెంట్ లలో మాత్రం ఎవరితో పాజిటివ్ రిలేషన్ ను సంపాదించుకోలేదు. ఇక కొందరైతే కౌశల్ పై ఇప్పటికి గుర్రుగానే ఉన్నారు.
కౌశల్ విజేత అవడం జీర్ణించుకోలేక హౌస్ మేట్స్ ఇప్పటికీ కౌశల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ యాక్టివిస్ట్ - హేతువాది అయిన బాబు గోగినేని తాజాగా చేసిన వ్యాఖ్యు హాట్ టాఫిక్ గా మారాయి. ఆయన ఇంట్లో ఉన్నంత వరకు మాత్రమే ‘బిగ్ బాస్’ గురించి ఆలోచిస్తాడు ఆయన బయటకు వచ్చాక ఇలాంటివి పట్టించుకోరు అని అంతా భావించారు. కాని ‘బిగ్ బాస్’ ఇంట్లో ఉన్నప్పటి నుండే కౌశల్ కు తీవ్ర విరోధి అయిన బాబుగోగినేని తాజాగా జరిగిన గ్రాండ్ ఫినాలేకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌశల్ విజేత అవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తాజాగా సోషల్ మీడియాలో కూడా కౌశల్ పై - కౌశల్ ఆర్మీ పై అంతేకాకుండా ‘బిగ్ బాస్’ నిర్వాహకులపై కూడా తీవ్రంగా మండిపడ్డారు.
కౌశల్ స్వార్ధం చూపిస్తూ - ఎన్నో కుట్రలు చేసి ఇంట్లో వాళ్లని గందరగోళానికి గురి చేసిన ఆయనకు ‘బిగ్ బాస్’ నిర్వాహకులు అన్ని విధాల సహాయపడ్డారు. అంతేకాకుండా రీఎంట్రీ సమయంలో కూడా కౌశల్ కు అనుకూలమైన వారినే తీసుకువచ్చారు. ఇక కౌశల్ భార్య బయట ఉండి అన్నీ చూసుకుంది - ఈ విషయాన్ని కాస్త బయటి నుండి వచ్చిన వాళ్లు కౌశల్ కు చెబుతుంటే తాను స్వయంగా విన్నాను అంటూ చెప్పుకొచ్చారు. అసలు గేమ్ థీమ్ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండడం కానీ దానికి విరుద్దంగా తాజాగా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు వ్యవహరించారు అంటూ మండిపడ్డారు.
అందరిని సమానంగా చూడాల్సిన గేమ్ షో నిర్వాహకులు మొదటి నుండి కౌశల్ ని సమర్ధించారు - కౌశల్ వల్ల కొన్ని రౌడీ మూకలు సామాజిక మాధ్యమాల్లో విజృంభించారు. వాళ్లు దీప్తి సునయన - తేజస్విలను అసహ్యంగా దూషించారు. 3,500 ఇస్తే వేలల్లో ఈమెయిల్ అకౌంట్ లు కొనవచ్చు అంతేకాకుండా ఓట్లు కూడా వాళ్లే వేసిపెడతారు. ఆట నియమాలు పాటించిన వాళ్లే విజేతు అయినట్టు మిగతా వారంతా తమ ముఖాలను అద్దంలో చూసుకోండి అంటూ కౌశల్ పై నిప్పులు చెరిగాడు. ఆట బుకీస్ చేతిలోకి వెళ్లిపోయింది, రియాలిటీ షో కాస్త కొంతమంది చేతుల్లోకి వెళ్లిపోయింది అంటూ నిర్వహకులపై కౌశల్ పై బాబుగోగినేని మండి పడ్డారు