మూడు తరాల అందాలు ఒకే చోట

Update: 2017-08-04 05:36 GMT
సినిమా ఫ్యామిలి అంటే సాదారణంగా క్రేజ్ ఉంటుంది. దానితో పాటుగా వాళ్ళ పై ఒక ప్రత్యేక అభిమానం కూడా ఉంటుంది. మరి అది ఏ మెగాస్టార్ ఫ్యామిలినో లేక సూపర్ స్టార్ ఫ్యామిలి అయితే మరింత ఎక్కువగా ఉంటుంది కదా. ఇండియాలో బచ్చన్ ఫ్యామిలి అంటే ఎనలేని క్రేజ్ ఉంది. అమితాబ్ బచ్చన్ అంటే మన దేశంలో సినిమా తెలిసిన ప్రతికి వ్యక్తికి తెలుసు. మరి అటువంటి బచ్చన్ ఫ్యామిలి గురించి తెలుసుకోవాలని వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అనే దానిపై చిన్న ఆసక్తి ఉండనే ఉంటుంది.

ఇప్పుడు అలా ఆలోచించే అభిమానులు కోసం బచ్చన్ ఇంటి  ఆడవాళ్ళు అంతా కలిసి ఒక ఫోటో షూట్ చేశారు. అమితాబ్ కూతురు శ్వేత మామూలుగా ఫ్యామిలికి సంబందించిన ఫంక్షన్ కోసం మాత్రమే బయట కనపడుతూ ఉంటుంది. కానీ ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం అమితాబ్ భార్య జయా బచ్చన్, అతని కూతురు శ్వేత బచ్చన్ నందా అతని మనవరాలు (కూతురు కూతురు) నవ్య నవేలి నందా తో అభిమానులకు ఎప్పటికీ గుర్తుండి పోయేలాగా ఒక ఫోజిచ్చారు. తల్లి కూతురు కలిసి ఒక ఫంక్షన్ కి వస్తేనే అందరి దృష్టి వాళ్ళ పై పడుతుంది. ఇప్పుడు మనవరాలు కూడా తోడైయింది మరి ఇంకా అక్కడ సందడి - వాళ్ళు పొందే ఆనందం మనం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది. అమ్మ అండ్ అమ్మమ్మ తో తన ఆనంద క్షణాలును ఆస్వాదిస్తూ తన మేను మెరుపులును స్టైలిష్ గా చూపించింది ఆ మనవరాలు.

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలి నుండి ఇంత వరకు ఏ హీరోయిన్ రాలేదు అనుకుంటున్న వాళ్ళకి ఈ మనవరాలు జవాబుగా ఉంటుంది. నవ్య నవేలి నందా త్వరలో సినిమా లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా నటి కావాలని అనుకుంటుంది అని ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. కాకపోతే ఇంకా హీరోయిన్ కావడానికి టైమ్ ఉండడంతో ఎటువంటి అధికార ప్రకటన చేయటంలేదు.


Tags:    

Similar News