'సైరా' బ్యాక్ గ్రౌండ్ 300 వాయిస్ లా?!

Update: 2019-08-22 01:30 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `సైరా-న‌ర‌సింహారెడ్డి` టీజ‌ర్  యూట్యూబ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. టీజ‌ర్ రిలీజైన 12 గంట‌ల్లోనే కోటి వ్యూస్ సాధించి ఇప్ప‌టికి కోటిన్న‌ర వ్యూస్ (15 మిలియ‌న్)తో దూసుకుపోతోంది. అత్యంత వేగంగా 10కోట్ల మంది వీక్షించే టీజ‌ర్ ఇద‌ని మెగా ఫ్యాన్స్ ఎగ్జ‌యిట్ అవుతున్నారు. టీజ‌ర్ తో మొద‌లైన ప్ర‌చార యుద్ధాన్ని పీక్స్ కి తీసుకెళ్లేందుకు కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ అధినేత రామ్ చ‌ర‌ణ్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది. అక్టోబ‌ర్ 2 రిలీజ్ ని దృష్టిలో పెట్టుకుని అన్ని మెట్రోల్లోనూ `సైరా` ప్ర‌త్యేక ప్ర‌చార‌ కార్య‌క్ర‌మాల్ని డిజైన్ చేశారు.

ఆస‌క్తిక‌రంగా టీజ‌ర్ బ్యాక్ గ్రౌండ్ లో  ప‌వ‌న్ క‌ల్యాణ్ వాయిస్ వినిపించ‌డంతో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ లోకి ఈ టీజ‌ర్ అత్యంత‌ వేగంగా దూసుకెళ్లింది. అందుకే ఇంత వేగంగా టీజ‌ర్ కి అన్ని వ్యూస్ ద‌క్కాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రోవైపు ఈ సినిమాకి అటు త‌మిళ‌నాడులో ర‌జ‌నీకాంత్.. బాలీవుడ్ లో అమితాబ్ ప్ర‌చార సాయం చేయ‌నున్నారట‌. త‌మిళ వెర్ష‌న్ కు ర‌జ‌నీకాంత్ వాయిస్ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. సినిమా ఆద్యంతం ర‌జ‌నీ గాంభీర్య‌మైన స్వ‌రం బ్యాక్ గ్రౌండ్ వాయిస్ గా వినిపిస్తుంద‌ట‌. మలయాళంలో మోహన్ లాల్.. కన్నడంలో రాక్ స్టార్ యష్ .. హిందీలో కండ‌ల‌ హీరో హృతిక్‌ రోషన్ లతో బ్యాక్ గ్రౌండ్‌ వాయిస్ ను వినిపిస్తార‌ని.. అందుకు ఇప్ప‌టికే ప్రయత్నాలు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది.

అంతా బాగానే ఉంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వాయిస్ తెలుగు ఆడియెన్ వ‌ర‌కూ ఓకే. త‌మిళానికి ర‌జ‌నీకాంత్ గంభీర‌మైన వాయిస్ ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇత‌ర భాష‌ల్లోనూ ఎవ‌రు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వినిపించినా అందులో గాంభీర్యం ఇంపార్టెంట్. ఇంత‌కుముందు రిలీజైన ఎన్నో అనువాద చిత్రాల‌కు గంభీర‌మైన వాయిస్ తో బ్యాక్ గ్రౌండ్ లో క‌థ‌ను వినిపించ‌డం ద్వారా రోమాలు నిక్క‌బొడుచుకునేంత ఉత్కంఠ థియేట‌ర్ల‌లో ఆడియెన్ కి క‌లిగింది. ముఖ్యంగా 300 తెలుగు వెర్ష‌న్ కి డ‌బ్బింగ్ వాయిస్ ఎంత గంభీరంగా ఉంటుందో తెలిసిందే. ఆ గొంతు వినేందుకే మ‌ళ్లీ మ‌ళ్లీ సినిమా చూసిన వాళ్లు ఉన్నారు. ఇక అరుంధ‌తి సినిమాలో సోనూసూద్ పోషించిన ప‌సుప‌తి పాత్ర‌కు ర‌వికిష‌న్ గంభీర‌మైన వాయిస్ అంతే పెద్ద ప్ల‌స్ అయ్యింది. ఇప్పుడు `సైరా-న‌ర‌సింహారెడ్డి`కి అంతే గంభీర‌మైన వాయిస్ నావెల్టీగా వినిపిస్తే అది ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. కేవ‌లం స్టార్ ని చూసి గొంతు వినిపించ‌డ‌మే కాదు.. అందులో గాంభీర్యాన్ని ప‌రిశీలించాల్సి ఉంటుంది. హిస్టారిక‌ల్ సినిమాల‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్ర‌మే కాదు క‌థ‌ను.. టైటిల్ పాత్ర తీరుతెన్నుల్ని వినిపించే గొంతు ఎప్పుడూ గంభీరంగా ఉండ‌డం చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్రేక్ష‌కుడిని క‌థ‌లో లీన‌మ‌య్యేలా తాథాత్మ్య‌క‌త‌ను క‌లిగిస్తుంది.


Tags:    

Similar News