ప్రముఖ వ్యాపారవేత్త 'లెజెండ్' శరవణన్ గురించి తమిళనాట అందరికీ తెల్సిందే. శరవరణ్ పేరిట ఉన్న తన సంస్థలకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. కత్తి లాంటి హీరోయిన్లకు పక్కన పెట్టుకొని శరవరణ్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ యాడ్స్ కు మంచి స్పందన లభించడంతో ఆయనకు సైతం విపరీతమైన క్రేజ్ పెరిగింది.
శరవణన్ కు చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండేది. అయితే వ్యాపారంలో ఆయన బీజీగా మారడంతో తన కోరికను కొన్ని దశాబ్దాలపాటు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక 60ఏళ్లకు కాస్తా అటుగా ఉన్న శరవణన్ లో మాత్రం నటనపై ఆసక్తి మాత్రం తగ్గకపోవడంతో ఇటీవల ఏకంగా 'లెజెండ్' పేరిట సినిమాను నిర్మించాడు.
స్టార్ హీరోలకు ధీటుగా భారీ బడ్జెట్లో 'లెజెండ్' మూవీని తెరకెక్కించి ఔరా అనిపించుకున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయి నటీనటులను ఎంపిక చేసి మరీ సినిమాలో నటింపజేయించారు. అంతేస్థాయిలో సినిమాను ప్రమోట్ చేశారు. తమిళనాడులో ఒకటి రెండ్రోజులు ఈ సినిమాకు భారీ ఓపెన్స్ వచ్చినా ఆ తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ సినిమాకు భారీగానే నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.
'లెజెండ్' సినిమా కేవలం శరవణన్ కు సినిమాపై ఎంత మక్కువ ఉందో తెలియజేస్తోంది. ఈ సినిమా రిజల్ట్ ముందుగానే ఉహిందే కావడంతో ఎవరికీ పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. అయితే ఈ సినిమా విడుదలై చాలారోజులు అవుతున్నా ఓటీటీ డేట్ మాత్రం అధికారికంగా వెలువడలేదు. అప్పట్లో ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో విడుదల అవుతుందని ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు మాత్రం ఈమూవీలో ఓటీటీలో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. శరవణన్ తన సినిమాను ఓటీటీకి ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదట. కొన్ని డిజిటల్ సంస్థలు ఈ సినిమాను కొనేందుకు మంచి ఆఫర్ ఇచ్చినా శరవణన్ మాత్రం డీల్ కు ఒప్పుకోవడం లేదు. తనకు ఉన్న ఆస్తులతో ఈ డీల్ వచ్చేది చిల్లరతో సమానమనని తన స్నేహితులతో అన్నారట. దీంతో ఇక ఈ సినిమా ఓటీటీలో వచ్చే అవకాశం తక్కువేనని చెన్నైలో టాక్ విన్పిస్తోంది.
మరోవైపు ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫాంలో వస్తే కొందరు ట్రోలింగ్ పేరుతో వీడియోలను చూస్తున్నారు. అయితే అలాంటి వాటికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 'లెజెండ్' ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి 'లెజెండ్' శరవణన్ ట్రోలింగ్ చేసే వారికి గట్టి షాకివ్వడంతోపాటు నిజంగా ఈ సినిమాను ఓటీటీలో చూడాలని వెయిట్ చేస్తున్న తన అభిమానులకు సైతం నిరాశ పరిచారు.
అయితే త్వరలోనే 'లెజెండ్' మించిన కథతో శరవణన్ మరో సినిమాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాట దీంతో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం కన్పిస్తోంది. మరీ ఈ సినిమాతోనైనా 'లెజెండ్' శరవణన్ కు హిట్టు కొడుతాడో లేదో చూడాల్సిందే..!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.