ప్రతిసారీ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజున మహేష్ సినిమాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమం విధిగా ఉండేది. కానీ ఈసారి ఏమైందో మహేష్ అభిమానులు షాక్ లోకి వెళ్లారు. ఈ స్పెషల్ డే సర్ ప్రైజ్ లేదు కదా.. కనీసం బర్త్ డే హంగామా కూడా ఏమాత్రం కనిపించలేదని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన `సర్కారు వారి పాట` సక్సెస్ ని ఆస్వాధిస్తున్నారు. అయితే ఇంతలోనే తన తదుపరి చిత్రానికి సంబంధించిన సర్ ప్రైజ్ ఉంటుందని భావించారు ఫ్యాన్స్. తాత్కాలికంగా SSMB 28 అని టైటిల్ ని ఫిక్స్ చేసిన ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రీప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయన్న టాక్ వినిపించింది.
ఈరోజు సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో అభిమానులు SSMB 28 గురించిన అప్ డేట్ ని ఆశించారు. కానీ ఈరోజు టీమ్ ఎలాంటి సర్ ప్రైజ్ ని ఇవ్వలేదు. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. కృష్ణ గారి బర్త్ డే కి తన సినిమాల ప్రచారానికి ఆసక్తిని కనబరిచే మహేష్ కూడా ఎందుకనో సైలెంట్ గా ఉన్నారు.
అసలింతకీ ఏం జరుగుతోంది? మాంత్రికుడు అందించిన బౌండ్ స్క్రిప్టు ఇంకా మహేష్ ని సంతృప్తి పరచలేదా? లేక ఇంకా కాస్టింగ్ విషయంలో డైలమా కొనసాగుతోందా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. SSMB 28లో పూజా హెగ్డే కథానాయిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీత దర్శకుడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని టాక్ ఉంది. దీనికి సంబంధించి అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
రాజమౌళితో ఎప్పుడు?
త్రివిక్రమ్ తో చిత్రీకరణ ఇప్పటికే ఆలస్యమైంది. కరోనా వల్ల అంతకంతకు ఆలస్యమై చివరికి ఈ జూలై లో మహేష్ తన కొత్త సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నారని సమాచారం. అలాగే రిలీజ్ కి ఒక డెడ్ లైన్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారట. ఈ సినిమాని 2013 సంక్రాంతికి విడుదల చేయాలని మహేష్ భావిస్తున్నట్లు టాక్ వినిపించింది. అంటే ఆరు నెలల్లోనే ఈ మూవీని పూర్తి చేసి రిలీజ్ కి తేవాల్సి ఉంటుంది.
సంక్రాంతి బరిలో ప్రతిసారీ మహేష్ కి విజయమే కానీ అపజయం అరుదు. అందుకే ఈ డేట్ ని లాక్ చేయాలని భావిస్తున్నారట. కానీ త్రివిక్రమ్ చెప్పిన టైమ్ కి సినిమాని పూర్తి చేస్తేనే ఇది పాజిబుల్. కరోనా క్రైసిస్ ముప్పు ఇప్పట్లో లేదు కాబట్టి ఇకపై సినిమాల షూటింగులకు ఇబ్బందులేవీ లేవు. స్వతహాగానే స్టార్ డైరెక్టర్ తన సినిమాలను షూట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటాడు కాబట్టి సంక్రాంతి బరిలోకి అందిస్తాడా లేదా? అన్నదే ఇప్పుడు సస్పెన్స్.
అయితే మహేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలనే ఉత్సాహంలో ఉన్నారు. త్రివిక్రమ్ మూవీ పూర్తి చేసి వెంటనే తన పాన్ ఇండియా మూవీని ప్రారంభించే ఆలోచనతో ఉన్నాడు. అందుకు రాజమౌళి- విజయేంద్ర ప్రసాద్ బృందం స్క్రిప్టును కూడా లాక్ చేసేస్తోందనే గుసగుస వినిపిస్తోంది. ఇక ఒక్కసారి రాజమౌళి సినిమాకి వెళితే వచ్చే రెండేళ్లు కచ్చితంగా ఇక తీరిక అన్నది ఉండదు. వేరే సినిమా ఏదీ చేయలేదు. కాబట్టి రాజమౌళితో మహేష్ షెడ్యూళ్లకు అనుగుణంగా త్రివిక్రమ్ వేగంగా తన సినిమాని పూర్తి చేయాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. తదుపరి ప్రణాళికల దృష్ట్యా .. 2023 వేసవిలోపు కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ కి తేవాలని త్రివిక్రమ్ కి మహేష్ డెడ్ లైన్ ఫిక్స్ చేసాడన్న టాక్ కూడా ఇటీవల వినిపించింది.