దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన కీర్తి సురేష్.. 2021లో ఇప్పటికే 'రంగ్ దే' 'పెద్దన్న' 'మరక్కార్' వంటి మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ క్రమంలో ''గుడ్ లక్ సఖీ'' అనే మరో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ స్పోర్ట్స్ డ్రామాని డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరో మూడు రోజుల్లో రిలీజ్ ఉన్నా ఈ సఖి ఎక్కడా హడావుడి చేయడం లేదు.
''గుడ్ లక్ సఖీ'' చిత్రంలో కీర్తి సురేష్ తోపాటుగా ఆది పినిశెట్టి - జగపతిబాబు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దీనికి దర్శకత్వం వహించారు. ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్ గా ఎలా మారిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. దిల్ రాజ్ సమర్పణలో సుధీర్ చంద్ర - శ్రావ్యా వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ సమర్పిస్తున్న సినిమా కావడం.. 'మహానటి' కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. అయితే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉండటంతో దీనిపై కాస్త ఆసక్తి కూడా తగ్గిందనే టాక్ ఉంది. ఎట్టకేలకు ఈ నెల చివర్లో వస్తుందని అనుకుంటుండగా.. మేకర్స్ 'గుడ్ లక్ సఖీ' ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కీర్తి కూడా సినిమా గురించి ఎక్కడా మాట్లాడటం లేదు.
మరోవైపు నిన్న కాక మొన్న విడుదల తేదీని ప్రకటించిన సినిమాలు మాత్రం శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీని లాక్ చేసుకున్న 'అర్జున ఫల్గుణ' - జనవరి 1న రాబోతున్న 'ఇందువధన' కూడా ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేశాయి. కానీ 'గుడ్ లక్ సఖి' మాత్రం సైలెంట్ గా ఉంటోంది. దీంతో ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని టాక్ నడుస్తోంది.
ఒకవేళ కీర్తి సురేష్ సినిమా కనుక వాయిదా పడితే ఇప్పట్లో మరో మంచి రిలీజ్ డేట్ దొరికే అవకాశం లేదు. ఎందుకంటే జనవరి ఫస్ట్ వీక్ లో 'ఆర్.ఆర్.ఆర్' మొదలుకొని 'రాధే శ్యామ్' 'బంగార్రాజు' 'మేజర్' 'ఖిలాడి' 'భీమ్లా నాయక్' 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి పలు పెద్ద సినిమాల విడుదలలు ఉన్నాయి. వీటి మధ్య గ్యాప్ లో మీడియం రేంజ్ సినిమాలు ఎలాగూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'గుడ్ లక్ సఖి' రిలీజ్ అయితే లక్ కలిసొస్తుందో లేదో చెప్పలేం. మరి ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాతలు ఏం ఆలోచిస్తున్నారో.