బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా ఎంతో ఎత్తుకు ఎదిగిన శిల్పాశెట్టి ఇప్పుడు తన భర్త వల్ల అభాసుపాలు కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కెరీర్ లో సినిమాల పరంగా ఆకట్టుకొని ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న ఈ నటికి భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల కేసులో అరెస్ట్ కావడం శరాఘాతంగా మారింది.
హీరోయిన్ గా ముగింపు దశకు వచ్చిన వేళ బ్రిటీష్ రియాలిటీ షో ‘బిగ్ బ్రదర్’లో నటించడం ద్వారా ఎక్కడ లేని పాపులారిటీని శిల్పా శెట్టి తెచ్చుకుంది. ఆ షోలో ఆమెపై వర్ణ వివక్ష చూపడంతో సానుభూతి వర్కవుట్ అయ్యి అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యింది.
ఇక ఆ తర్వాత రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకొని ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ లో వాటా పొందింది. యోగా బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. భర్తతో కలిసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. ఇలా శిల్పా రేంజ్ మారిపోయింది. కెరీర్ ముగిసిందనుకున్న స్థితి నుంచి ఆమె ఎదుగుదల చూసి తన తోటి హీరోయిన్లు అసూయ చెందారు.
కానీ సడెన్ గా భర్త అరెస్ట్ తో ఇప్పుడు శిల్పా శెట్టి జీవితం అల్లకల్లోలంగా మారింది. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. అశ్లీల వీడియోల కేసులో ఇరుక్కొని విచారణ ఎదుర్కొంటున్నారు. అతడిపై అభియోగాలు బలంగా ఉన్నాయి. రుజువైతే జైలు శిక్ష పడడం ఖాయమంటున్నారు. శిక్ష సంగతి పక్కనపెడితే ఇప్పట్లో అంత తేలికగా ఈ వ్యవహారం బయటపడేటట్లు కనిపించడం లేదు. కుంద్రా కేసు వల్ల పర్సనల్ అవకాశాలు కూడా కోల్పోతోంది. ఆమె జడ్జిగా వ్యవహరించే డ్యాన్స్ షో నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక ఆమె చేతిలో ఉన్న కమర్షియల్ బ్రాండ్స్ కొన్ని చేజారేలా కనిపిస్తున్నాయి. కొత్త బ్రాండ్లు ఏవీ ఆమెను సంప్రదించడం లేదు.
ఇటీవలే చాలా గ్యాప్ తర్వాత శిల్పా శెట్టి తీసిన మూవీ ‘హంగామా2’ సినిమాపై కూడా ఇప్పడు నెగెటివ్ ప్రచారం మొదలైంది. ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో శిల్పా కు పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది. పరిస్థితులు చూస్తుంటే శిల్పాశెట్టి టైం అస్సలు బాగాలేదని తెలుస్తోంది.
ఈ కేసుపై మరింత దర్యాప్తు కోసం ఇటీవల ముంబైలోని జుహు వద్ద ఉన్న శిల్పా, రాజ్ నివాసమైన 'కినారా' బంగ్లాపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. ఆ దాడి జరిగినప్పుడు పోలీసులు రాజ్ ను ఆయన నివాసానికి వెంటబెళ్లుకెళ్లారు. అతని భార్య శిల్పా వాంగ్మూలాలు రికార్డ్ చేయబడ్డాయి. నివేదికల ప్రకారం శిల్పా -రాజ్ ఈ తప్పుచేయలేదని వాదన వినిపించారు. శిల్పాశెట్టి పోలీసుల ముందు తమ తప్పు ఏం లేదని బుకాయించింది.
ఫ్రీ ప్రెస్ జర్నల్లో వచ్చిన కథనాల ప్రకారం రాజ్ కుంద్రాను పోలీసులు తన ఇంటికి తీసుకువచ్చినప్పుడు శిల్ప కదిలిపోయి బోరుమని ఏడ్చేసిందట.. శిల్పా ప్రకటన దాదాపు 2 గంటలు రికార్డ్ చేయబడింది. ఆమె సంస్థలో తన ప్రమేయాన్ని కూడా ఖండించింది.