బాహుబలి-ది కంక్లూజన్.. టాలీవుడ్ లో విపరీతమైన ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపుగా ఫైనల్ స్టేజ్ కు తీసుకొచ్చేశారు. ప్యాచప్ వర్క్స్ తప్ప వేరే ఏమీ పెండింగ్ లేవని.. ఇక మిగిలిన టైం అంతా.. గ్రాఫిక్స్.. పోస్ట్ ప్రొడక్షన్.. ప్రపంచభాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు వీలుగా డబ్బింగ్ కార్యక్రమాలను చేపట్టబోతున్నారు.
2017 ఏప్రిల్ 28న బాహుబలి2 రిలీజ్ అవుతుందని ముందే చెప్పేశారు. ఇందుకు తగ్గట్లుగానే అన్ని వర్క్స్ జరిగిపోతున్నాయి. లేట్ అవుతుందనే రూమర్స్ ను యూనిట్ ఖండించేసింది కూడా. అయితే.. ఈ మూవీని ప్రీపోన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇందుకు కారణం లీకేజ్ భయాలే అంటున్నారు. రీసెంట్ గా బాహుబలి2 కి సంబంధించిన 9 నిమిషాల వీడియో లీక్ అయింది. ఇప్పటికైతే బయటకు వచ్చిన ఫీడ్ కారణంగా పెద్దగా నష్టం లేదు కానీ.. ఇంకా ఆరు నెలలు ఆగితే మాత్రం లీకేజ్ సమస్య పెద్దది కావచ్చని అనుకుంటున్నారట.
ఈ సారి లీకేజ్ జరిగితే మాత్రం సినిమాకి కోలుకోలేని నష్టం కలుగుతుందనే ఉద్దేశ్యంతో.. ఓ నెల- నెలన్నర వరకూ ప్రీపోన్ చేసి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ ప్రస్తుతం నిర్మాత-దర్శకుల మధ్య సాగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమై.. బాహుబలిని ప్రీపోన్ చేస్తే మాత్రం.. అనేక ఇతర సినిమాలకు.. సమ్మర్ ని ఎంజాయ్ చేసే ఛాన్స్ లభించినట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/