చిత్రం : బాజీరావు మస్తానీ
నటీనటులు: రణ్వీర్ సింగ్ - దీపికా పదుకొనే - ప్రియాంక చోప్రా - మహేష్ మంజ్రేకర్ - మిలింద్ సోమన్ - ఆదిత్య పంచోలి - తన్వి తదితరులు
నేపథ్య సంగీతం: సంచిత్
నిర్మాణం: బన్సాలీ ప్రొడక్షన్స్ - ఈరోస్ ఇంటర్నేషనల్
రచన - సంగీతం - దర్శకత్వం: సంజయ్ లీలా బన్సాలీ
ఇండియన్ ఫిలిం మేకర్స్ చారిత్రక నేపథ్యంలో వార్ మూవీస్ తీయడం అరుదు. దీనికి భారీ బడ్జెట్ కావాలి. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సినిమా తీయాలి. ఇంతా చేస్తే పెట్టిన ఖర్చుకు తగ్గ వసూళ్లు వస్తాయో రావో అన్న సందేహం. అందుకే విస్తృతమైన మార్కెట్ ఉన్న బాలీవుడ్ లో సైతం ఇలాంటి రిస్క్ చాలా తక్కువమందే తీసుకుంటారు. ఐతే ‘బాహుబలి’ తర్వాత అక్కడి జనాల దృష్టికోణం మారింది. పకడ్బందీగా తీస్తే ఇలాంటి చిత్రాలతోనూ వందల కోట్లు కొల్లగొట్టవచ్చని రుజువైంది. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన చారిత్రక చిత్రం ‘బాజీరావు మస్తానీ’ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్లే ఉందో లేదో చూద్దాం పదండి.
కథ:
మరాఠా సామ్రాజ్యాన్ని ఏలే పేష్వాల్లో చక్రవర్తి తదనంతరం రాజ్య పగ్గాలు చేపట్టే వారసుడి కోసం చూస్తుండగా ఆ బాధ్యత తాను తీసుకుంటానని ముందుకొస్తాడు బాజీరావు (రణ్ వీర్ సింగ్). చక్రవర్తి పెట్టిన పరీక్షలో నెగ్గి రాజ్యాధికారం అందుకుంటాడు. ఆ తర్వాత తన వీరత్వం చూపించి పదుల సంఖ్యలో యుద్ధాలు గెలుస్తాడు. మొత్తం దేశమంతా హిందూ సామ్రాజ్యమే ఉండాలని.. ఢిల్లీలో తమ జెండా ఎగుర వేయాలన్నది అతడి లక్ష్యం. ఈ దిశగా సాగుతుండగా.. బుందేల్ ఖండ్ యువరాణి (దీపికా పదుకొనే) కోరిక మేరకు ఆమె సామ్రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడతాడు బాజీరావు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. బాజీరావు కోసం మస్తానీ అతడి రాజ్యానికి వచ్చేస్తుంది. కానీ బాజీరావుకు అప్పటికే పెళ్లయి ఉంటుంది. పైగా బ్రాహ్మణ కుటుంబంలోకి ఓ ముస్లిం యువతిని ఆహ్వానించడానికి రాజ కుటుంబం ఒప్పుకోదు. మరి బాజీరావు-మస్తానీల బంధం ఏ పరిణామాలకు దారి తీసింది? దేశమంతా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న బాజీరావు లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.
కథనం - విశ్లేషణ:
బాజీరావు మస్తానీ సినిమాను.. బాలీవుడ్ బాహుబలి అని.. మరో మొఘల్-ఎ-అజామ్ అని కీర్తించేస్తున్నారు జనాలు. ట్రైలర్ చూశాక ఇలాంటి అంచనాలు ఏర్పడితే తప్పేం లేదు. కానీ అలాంటి ఆశలతోనే, అంచనాలతోనే సినిమాకు వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. ఇది రోమాలు నిక్కబొడిచేలా హీరోయిజం ఉన్నసినిమా కాదు. ఇందులో రసవత్తరమైన యుద్ధ సన్నివేశాలేమీ లేవు. అద్భుతమైన విజువల్ ఎఫెక్టుల్లాంటివేమీ కూడా లేవు. మొత్తంగా మన బాహుబలి తరహాలో కంటికింపైన, జనరంజకమైన మసాలా సినిమా ఎంతమాత్రం కాదు. అలాగని ‘మొఘల్ ఎ అజామ్’ తరహా క్లాసిక్ కూడా కాదు. భారీతనం నిండిన ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ మాత్రమే.
బాజీరావు - మస్తానీల కథ నిజంగా జరిగిందే. ఐతే దాన్ని మన ‘రుద్రమదేవి’ తరహాలో డ్రమటైజ్ చేయడానికి, మసాలా అద్దడానికి బన్సాలీ ఆసక్తి చూపించలేదు. ఇక బాహుబలితో అయితే ఏ రకంగానూ పోల్చుకోవడానికి వీల్లేదు. బన్సాలీ తనదైన పొయెటిక్ వేలో ఓ ప్రేమకావ్యాన్ని తీర్చిదిద్దడానికే ప్రయత్నించాడు. ప్రధానంగా ఎమోషన్స్ మీదే కథను నడిపించాలని చూశాడు. మామూలుగానే బాలీవుడ్ సినిమాలు స్లో అంటే బన్సాలీ మరీ నెమ్మదిగా సినిమాను నడిపించాడు. మసాలా అద్దడానికి ఎక్కడా ప్రయత్నించకుండా... డ్రమటైజ్ చేయకుండా.. రియలిస్టిక్ గా సినిమా తీశాడు. దీంతో రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న ‘బాజీరావు మస్తానీ’ చాలా వరకు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. సినిమాలో యుద్ధ నేపథ్యం అన్నది చిన్న భాగం మాత్రమే. ఆరంభంలోనే ఆ యుద్ధం రుచి చూపించేస్తారు. ఐతే అది బాహుబలి తరహాలో ఉత్సాహం నింపేలా ఏమీ ఉండదు.
సినిమాలో ప్రధాన ఆకర్షణ ప్రధాన పాత్రధారుల అద్భుత నటనే. రణ్ వీర్ - దీపికల అద్భుతమైన అభినయం.. వాళ్లిద్దరి కెమిస్ట్రీ.. ప్రియాంక చోప్రా పెర్ఫామెన్స్ సినిమాకు పెద్ద బలం. ముగ్గురూ కూడా ఎమోషన్స్ అద్భుతంగా పలికించారు. ఇక కళ్లు చెదిరిపోయే విజువల్ గ్రాండియర్.. బన్సాలీ మార్కు భారీతనం.. మెచ్యూర్డ్ డైలాగ్స్.. బాజీరావు-మస్తానీల ప్రేమకథలోని ఇంటెన్సిటీ ఆకట్టుకుంటాయి. ఐతే ఏ మలుపులూ.. మసాలా సన్నివేశాలూ ఏమీ లేకుండా మరీ నెమ్మదిగా సాగే ఈ సినిమాను భరించాలంటే చాలా ఓపిక మాత్రం ఉండాలి. బన్సాలీ మరీ పొయెటిగ్గా సినిమా తీయబోయే సినిమాను బాగా సాగదీసేశాడు. ప్రేమకథలోని ఫీల్ ను అర్థం చేసుకుని.. నటీనటుల అభినయాన్ని, విజువల్ గ్రాండియర్ ను ఆస్వాదించేవారికి ‘బాజీరావు మస్తానీ’ గొప్పగా అనిపించొచ్చు. వెంటాడొచ్చు. కానీ బాహుబలి తరహాలో ఒక ఎంటర్టైనర్ ఆశిస్తే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు.
నటీనటులు:
రణ్ వీర్ సింగ్ తో ఇలాంటి పాత్ర వేయించడమే పెద్ద సాహసం. కానీ ఎలాంటి స్టార్ ఇమేజ్ లేకున్నా అతను బాజీరావు పాత్రను బాగా చేశాడు. ఆ పాత్రకు పక్కాగా సూటయ్యాడు. ఆహార్యంలో - నటనలో ఓ హుందాతనం చూపించాడు. అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్నాడు. దీపిక కూడా అతడికి దీటుగా నటించింది. గతంలో ఆమె చేసిన సినిమాలన్నింటికంటే ఇందులో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ప్రియాంక చోప్రా కూడా తన స్థాయికి తగ్గట్లు నటించింది. దీపిక, ప్రియాంకల మధ్య వచ్చే ఏకైక సన్నివేశంలో ఇద్దరూ గొప్పగా నటించారు. మిగతా నటీనటులందరూ కూడా బాగానే చేశారు.
సాంకేతిక వర్గం:
సాంకేతికంగా ‘బాజీరావు మస్తానీ’ ఉన్నతమైన సినిమా. సెట్టింగ్స్.. కాస్ట్యూమ్స్.. కెమెరా వర్క్.. నేపథ్య సంగీతం.. పాటలు.. కొరియోగ్రఫీ.. అన్నీ కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. సంచిత్ నేపథ్య సంగీతం, బన్సాలీ పాటలు బాగా కుదిరాయి. కాకపోతే ఎడిటింగ్ విషయంలోనే మరీ ఉదారంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ తరహా సినిమాలు ఇలాంటి ఫ్లోలోనే ఉండాలని వదిలేశారో ఏమో కానీ.. ఎండ్ టైటిల్స్ పడే సరికి ఒకటిన్నర సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో ముడిపడ్డ సినిమా అయినప్పటికీ బన్సాలీ ఎక్కడా రాజీ పడకుండా తాను అనుకున్నట్లే సినిమా తీశాడు. కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్నిచ్చినా.. దర్శకుడిగా ఆయన స్థాయిని పెంచే సినిమా ఇది.
చివరగా: బాజీరావ్ మస్తానీ.... ఒక సు....దీర్ఘ ప్రేమ కావ్యం
రేటింగ్: 2.75/5