టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. దేశవ్యాప్తంగా వారం రోజులుగా బాహుబలి ప్రభంజనం గురించే చర్చ. బాహుబలి ఈ స్థాయిలో హవా సాగిస్తుందని తెలిసుంటే ఈ శుక్రవారానికి సల్మాన్ ఖాన్, ధనుష్ కూడా రాకపోయేవారేమో. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ చేసేయడంతో హిందీలో భజరంగి భాయిజాన్, తమిళంలో మారి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
భజరంగి భాయిజాన్ విషయానికొస్తే.. చాన్నాళ్ల తర్వాత సల్మాన్ ఖాన్ ఓ మంచి సినిమా చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఎప్పుడూ మైండ్ లెస్ మాస్ సినిమాలు చేసే సల్మాన్.. ఈసారి మంచి ఎమోషన్స్ ఉన్న సినిమాలో నటించాడని అంటున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఓ చిన్నారిని ఇండియా నుంచి తన స్వస్థలానికి తీసుకెళ్లే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ నటన హైలైట్ అని చెబుతున్నారు. ప్రథమార్ధమంతా సరదాగా సాగిపోతుందని.. ద్వితీయార్ధంలో ఎమోషన్స్ అద్భుతంగా పండాయని.. సల్మాన్ కెరీర్లో ఇది గుర్తుంచుకోదగ్గ సినిమా అని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. భజరంగి భాయిజాన్ వల్ల నార్త్‌లో బాహుబలి హవా తగ్గడం ఖాయమని తెలుస్తోంది.
ఇక తమిళనాట బాహుబలి హవాకు తెరదించుతుందని భావించిన ‘మారి’కి అంత సీన్ లేదని అంటున్నారు. బాలాజీ మోహన్ దర్శకత్వం ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. కానీ వాటిని అందుకునే స్థాయిలో సినిమా లేదంటున్నారు. ధనుష్ పెర్ఫామెన్స్, ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే కానీ.. కంటెంట్ చాలా రొటీన్ అని, విలనిజం మరీ వీక్ అని.. సినిమా అనుకున్న స్థాయిలో ఆడే అవకాశం లేదని అంటున్నారు. కాబట్టి బాహుబలి వల్ల ‘మారి’కి ఇబ్బందే కానీ.. మారి వల్ల బాహుబలికి సమస్యేమీ లేదంటున్నారు.