నిజానికి ''బాహుబలి'' సినిమా ప్రభంజనం కారణంగా ''బజరంగీ భాయ్ జాన్'' కలెక్షన్లు తగ్గుతాయేమో అని ఒక సందేహం ఉండది. అందుకు తగ్గట్లుగానే తొలిరోజు సల్మాన్ ఖాన్ సినిమా ఇండియాలో 38 కోట్ల నెట్ వసూలు చేసింది. ఒక ప్రక్కన బాహుబలి తొలిరోజు నెట్ వసూళ్లు 42.3 కోట్లు కాబట్టి.. ఇక వీటిని బ్రేక్ చేయడం జరగని పని అన్నంత రేంజులో ఉంది. అయితే ఇదంతా సల్లూ భాయ్ ని పెద్దగా ఎఫెక్ట్ చేయట్లేదట. ఎందుకో?
ప్రతీసారి ఫార్ములా బేస్డ్ మసాలా సినిమాలతో వచ్చే సల్మాన్ ఖాన్.. ఈసారి మాత్రం చాలా కొత్తగా ఒక ఎమోషనల్ సబ్జెక్టుతో వచ్చాడు. అందులోనూ ఏ మాత్రం మసాలా సీన్లు అనేవే లేవు. హీరోయిన్ కరీనా కపూర్ ఉన్నా కూడా మనోడు ఏ మాత్రం మసాలా సాంగ్స్ అనేవే పెట్టనేలేదు. ఇంతటి ఎమోషనల్ డ్రామా బాహుబలి సినిమాకు ఏ యాంగిల్‌లో పోటీ అవుతుంది? అని అడుగుతున్నాడు భాయ్. పైగా తన సినిమాకు ఎప్పుడూ ఎంత వస్తాయో ఆ రేంజులో కలెక్షన్లు వస్తాయి అంటున్నాడు. ఖచ్చితంగా 220 కోట్ల పైమాట వసూళ్ళు రావడం అయితే మాత్రం పక్కా.. ఆ తరువాత ఎంత వస్తాయనేది మాత్రం ఎవ్వరం చెప్పలేం అని సెలవిచ్చారు ఎనలిస్టులు.