అమీర్ ఖాన్ సినిమాలు వచ్చినపుడు అతడి మీద ప్రశంసలు మాత్రమే కాదు.. వేరే హీరోల మీద సెటైర్లు కూడా పడుతుంటాయి. ముఖ్యంగా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను విమర్శకులు దెప్పి పొడుస్తుంటారు. అమీర్ మంచి సినిమాలతో ఇటు విమర్శకుల్ని మెప్పిస్తూ అటు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే.. సల్మాన్, షారుఖ్ చెత్త సినిమాలెందుకు చేస్తున్నారని తిట్టిపోస్తుంటారు క్రిటిక్స్. గత పదేళ్లలో సల్మాన్ సినిమాల్ని తీసుకుంటే.. ఏ ఒక్కదానికీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు లభించలేదు. కలెక్షన్లకైతే ఢోకా ఉండదు కానీ.. విమర్శకుల నుంచి ఛీత్కారం మాత్రం తప్పదు. గత ఏడాది రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన కిక్ సినిమాను కూడా క్రిటిక్స్ ఏకేశారు. రాజీవ్ మసంద్ లాంటి గ్రేట్ క్రిటిక్.. సల్మాన్ సినిమాలకు దారుణమైన రేటింగులిస్తుంటాడు.
ఐతే సల్మాన్ లేటెస్ట్ మూవీ భజరంగి భాయిజాన్ మాత్రం విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. మసంద్ కూడా ఈ సినిమా 3 స్టార్ రేటింగ్ ఇచ్చి.. సినిమా గురించి చాలా పాజిటివ్ గా రాశాడు. మొత్తం దేశవ్యాప్తంగా క్రిటిక్స్ అందరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన వస్తోంది. సల్మాన్ కెరీర్లో గుర్తుంచుకోదగ్గ సినిమా ఇదని.. గత పది పదిహేనేళ్లలో సల్మాన్ ఇలాంటి సినిమా చేయలేదని అంటున్నారు. సల్మాన్ సినిమాలో కథ గురించి మాట్లాడుకోవడం చాలా కాలం తర్వాత జరుగుతోందని.. మైండ్ లెస్ మాస్ మూవీస్ చేసే సల్మాన్ చాన్నాళ్లకు హృదయాల్ని కదిలించే సినిమా చేశాడని టాక్ వినిపిస్తోంది. హీరోయిజం కూడా హద్దుల్లో ఉందని.. పంచ్ డైలాగుల జోలికే వెళ్లలేదని.. నిజాయితీగా ఓ మంచి ప్రయత్నం చేశాడని.. క్రిటిక్స్ సల్మాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. సినిమాకు కలెక్షన్లు కూడా బాగానే ఉండటంతో సల్మాన్ మున్ముందు ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని చేసే అవకాశం కనిపిస్తోంది.