ఆరు రికార్డుల్ని బ్రేక్‌ చేయలేకపోయాడు

Update: 2015-07-25 18:03 GMT
భజరంగి భాయిజాన్‌ ఇటీవలే రిలీజై రికార్డు వసూళ్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సా ఫీస్‌ వద్ద సల్మాన్‌ మ్యాజిక్‌ మరోసారి పనిచేసింది. పైగా ఈసారి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ రచించిన కథ అంటూ విపరీతమైన పబ్లిసిటీ చేసి బోలెడంత మార్కెట్‌ చేసుకున్నారు. హ్యూమన్‌ ఎమోషన్స్‌ నేపథ్యం జనహృదయాల్ని ఆకట్టుకుంది. ఎన్ని రికార్డులు ఉన్నా.. భాయిజాన్‌ ఓ 6 రికార్డుల్ని మాత్రం టచ్‌ కూడా చేయలేకపోయాడు. అవేంటో పరిశీలిస్తే..

1) ఈ సినిమా తొలి రోజు వసూళ్లలో బాహుబలి రికార్డుల్ని కొట్టేయలేకపోయింది. భారతదేశంలోనే తొలి రోజు వసూళ్లలో 42.3 కోట్ల నెట్‌ సాధించిన ఏకైక సినిమా బాహుబలి. భజరంగి భాయిజాన్‌ 27.50 కోట్లు లోపే వసూలు చేసింది.

2) కేవలం హిందీ సినిమాలు తీసుకుంటే షారూక్‌ నటించిన హ్యాపీ న్యూ ఇయర్‌ 42.2 కోట్లు తొలిరోజు వసూలు చేస్తే ఆ రికార్డును కూడా అధిగమించలేకపోయింది.

3) కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలోనే తెరకెక్కిన ఏక్‌ థా టైగర్‌ తొలిరోజు వసూళ్లలో నెం.1, ఈద్‌ పండక్కే రిలీజైన ఈ చిత్రం తొలిరోజు 33 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది. భాయిజాన్‌ రికార్డు అంతకంటే తక్కువే.

4) హ్యాపీ న్యూ ఇయర్‌ 109కోట్లు తొలి మూడు రోజుల్లో వసూలు చేస్తే .. భాయిజాన్‌ రికార్డు కేవలం 102కోట్లు మాత్రమే.

5) గ్లోబల్‌ కలెక్షన్లలో బాహుబలి వసూళ్లను కొట్టేస్తున్న భాయిజాన్‌ 184కోట్లు మాత్రమే వసూలు చేయగలడు. దానికంటే ధూమ్‌ 3 వసూళ్లు ఎక్కువ. తొలి వారంలో ధూమ్‌ 3 రూ.185కోట్లు వసూలు చేసింది.

Tags:    

Similar News