టాలీవుడ్ హీరోలు ధరించిన కొన్ని వస్తువుల్ని ఆన్‌లైన్ ఆక్షన్‌లో పెట్టి సొమ్ములు చేసుకున్న చరిత్ర గతంలో ఉంది. అయితే అదంతా ఓ మంచి పని చేయడం కోసం చేసిన ప్రయత్నాలు. బాలయ్య బాబు సింహా గొడ్డలిని వేలానికి పెట్టినా, లెజెండ్ వస్తువుల్ని ఆక్షన్‌లో విక్రయించినా అదంతా మంచి పనుల కోసం చేసినది. హీరోల వస్తువుల్ని వేలానికి పెట్టి ఆ వచ్చిన మొత్తాల్ని వేరే మంచి పనుల కోసం ఉపయోగించిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు అలాంటిదేం కాదు... కానీ ఆన్‌లైన్‌లో వ్యాపారం నిర్వహిస్తూ కోట్ల కొద్దీ ప్రజల సొమ్ముల్ని స్వాహా చేస్తున్న అమెజాన్ డాట్ కాం ఓ కొత్త ప్రయత్నం చేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
కండల హీరో సల్మాన్‌ఖాన్ ఇమేజ్‌ని ఈ మార్కెటింగ్ పోర్టల్ తెలివిగా ఎన్‌క్యాష్ చేసుకుంటోంది. సల్మాన్ నటించిన భజరంగి భాయిజాన్ ఈ శుక్రవారం రిలీజ్‌కి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సల్మాన్ మెడలో ఉన్న సిల్వర్ పెండెంట్‌ను పోలే లాకెట్‌లను అమ్మకానికి పెట్టింది. ముంబై, హైదరాబాద్, పూణే, కోల్‌కత, బెంగళూరు, ఢిల్లీ నుంచి పెండెంట్ కోసం ఆర్డర్లు వచ్చాయి. 50 శాతం మొబైల్ ద్వారానే ఈ కొనుగోళ్లు చేశారు. సగం పైగా చిన్నా చితకా సిటీల నుంచి ఎంక్వయిరీలు వచ్చాయని అమెజాన్ కంపెనీ చెప్పింది. క్రేజు ఉన్నప్పుడు పిండుకోవడం అంటే ఇదేనేమో. ఇకపోతే ఈ లాకెట్ అమ్మకాల షేరుల్లో సల్మాన్‌కు కూడా వాటా ఉందండోయ్.