సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి ఇప్పుడు తమిళ్ లోనూ రూపొందబోతోంది. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా ఈ సినిమా రూపొందుండగా.. ఇప్పుడీ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత అయిన సీనియర్ దర్శకుడు బాల.. దర్శకత్వం వహించబోతున్నాడని చెబుతున్నారు.
ఒక కొత్త తరం కథ సీనియర్ దర్శకుల చేతుల్లో పడితే మరింత అద్భుతంగా రూపొందవచ్చని అనుకుంటాం కానీ.. అది అన్ని వేళలా సరికాదు. ముఖ్యంగా తమకంటూ ప్రత్యేకమైన శైలిని అలవరచుకున్న దర్శకులు.. ఇలాంటి రీమేకులను రూపొందించడంలో అసలే మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడు.. 3 ఈడియట్స్ మూవీని రీమేక్ చేస్తానని చెప్పినపుడు అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. హిందీలో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం.. తమిళంలో విజయ్ ప్రధాన పాత్రలో నంబన్ గా.. తెలుగులో స్నేహితుడుగా విడుదల అయింది. అయితే.. 3 ఈడియట్స్ ను యాజిటీజ్ గా తీసినా.. అసలే మాత్రం ఆకట్టుకోలేకపోయింది నన్ బన్.
ఇప్పుడు అర్జున్ రెడ్డిని బాల దర్శకత్వం వహించబోతున్నాడు. ఈయనేమీ సాధారణమైన ట్యాలెంట్ ఉన్నవాడు కాదు. సినిమా అంతా ఒకటే ఎమోషన్ తో తన స్టైల్ లో ప్రేక్షకులను పిండేయగలడు. అర్జున్ రెడ్డిలో ఆ ఎసెన్స్ చాలానే ఉంటుంది. కానీ.. ఈ జనరేషన్ ఫీలింగ్స్ ను అందిపుచ్చుకుని బాల ఏ మాత్రం రీమేక్ తీయగలడనేదే ప్రశ్న. అసలు ఇవన్నీ కల్ట్ ఫిలిమ్స్ అని.. వీటిని రీమేక్ చేయాలనే ఆలోచనే సరి కాదని అనేవారు కూడా ఉన్నారు. అందుకే శంకర్ లా చెడగొడతాడా? లేదంటే బాల తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తాడా? అని అందరూ ఎదురు చూస్తున్నారు.