నట సింహం బాలయ్య పుట్టిన్రోజు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పొలిటికల్ మరియు సినిమా కెరియర్ ను విశ్లేషించే ప్రయత్నం ఇది. చదవండిక. నాన్న ఎన్టీఆర్ అందించిన నట వారసత్వాన్ని, రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలయ్య ఇప్పుడు అన్ స్టాపబుల్ గా దూసుకువెళ్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేజీలు తనవేనని, తనకు తిరుగులేదని నిరూపించారు.
ఆ క్రమంలో బాలయ్య తన 107వ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తనకెంతో కలిసివచ్చిన డైలాగ్ ఒరియెంటెడ్ స్క్రిప్ట్ అండ్ సినేరియోతోనే రానున్నారు. ప్రకాశంలో జరిగిన ఓ యథార్థ కథ ఆధారంగానే ఈ సినిమా వస్తోంది. గోపీచంద్ మలినేని (బాలయ్య అభిమాని) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంకు సంబంధించిన పనులు వేగవంతం అవుతున్నాయి.
ఇక రాజకీయంగా చూసుకుంటే హిందూపురం నియోజకవర్గంలో వరుస రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మూడో సారి కూడా అక్కడ ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధం అవుతున్నారు. టీడీపీలో ఆయనకంటూ ప్రత్యేకమయిన ఫ్యాన్ బేస్ ఉంది. నటుడిగా నిర్మాత గా రాజకీయ నాయకుడిగా ఆయన రాణించిన వైనంకు ఓ చరిత్ర ఉంది.
గతం కన్నా వేగంగా సినిమాలే కాదు రాజకీయాలనూ చేస్తున్న బాలయ్య ఇప్పటికే కొన్ని పొలిటికల్ డైలాగ్స్ తో తాజా చిత్రం టీజర్ ను మోత మోగించారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్దేశించి గతంలో అంచనాలకు అందడానికి నువ్వేమయినా పొలవరం డ్యామ్ వా పట్టి సీమ తూము వా పిల్ల కాలువ వి అని అంటూ ప్రత్యర్థి వర్గాలను గడ గడలాడించారు.
ఇదే సమయంలో టీడీపీ కార్యకలాపాల్లోనూ జోరు పెంచి, మొన్నటి మహానాడులోనూ అలరించారు. ఆహా అనే ఓటీటీ వేదికపై అన్ స్టాపబుల్ పేరిట ఓ స్పెషల్ టాక్ షో చేసి ఇండస్ట్రీనే మరోసారి ఆకట్టుకుని టీఆర్పీ రేటింగులలో దూసుకుపోయారు.
దీంతో అసలు ఆహా అనే ఓటీటీకి ఊపు ఇచ్చిందే బాలయ్య అని తేల్చేశారు డిజటల్ మీడియా ఎనలిస్టులు. ఇక బాలయ్య అంటే టీడీపీ భయమా భక్తా అని రాశాను కదా ! అక్కడికే వద్దాం. రెండూ కాదు కానీ ఆయనంటే వారికి అభిమానం. పదవులను ఆశించని వైనం అంటే అభిమానం. నిత్యం నాన్న స్మరణ చేసే బాలయ్య అంటే అభిమానం. తోటి కళాకారులను గౌరవించే బాలయ్య అంటే టీడీపీకే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకూ అభిమానం..ఆ అభిమానం అన్ స్టాపబుల్.