వరుసగా పవర్ ఫుల్ ఇంగ్లిష్ టైటిళ్లకే ఓటేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. గత ఏడాది ‘లెజెండ్’గా దర్శనమిచ్చిన ఆయన ఈ సంవత్సరం ‘లయన్’గా మారాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘డిక్టేటర్’గా కనిపించబోతున్నాడు. వందో సినిమాకు ముందు మూడు సినిమాలకు ఇంత పవర్ ఫుల్ టైటిల్స్ పెట్టినపుడు.. సెంచరీ మూవీకి ఇంకా పవర్ ఫుల్ టైటిల్ ఆశిస్తారు కదా అభిమానులు. ఆ అంచనాలకు తగ్గట్లే బాలయ్య మైల్ స్టోన్ మూవీకి ఓ పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసేశాడట డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య వందో సినిమా పేరు.. గాడ్ ఫాదర్.
ఈ పేరుతో ప్రపంచ సినిమా చరిత్రనే మార్చిన మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇదే టైటిల్ తో ఇంకా ఎన్నో సినిమాలున్నాయి. ఐతే ఇండియాలో ఇంకెవరూ ఈ టైటిల్ వాడుకునే సాహసం చేయలేదు. ఇప్పుడు బాలయ్య సినిమాకు ఈ టైటిల్ పెట్టేశారు. ఇంగ్లిష్ ‘గాడ్ ఫాదర్’ తరహాలోనే ఇది కూడా మాఫియా బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతుందా.. లేక బోయపాటి ఇంకేదైనా ప్రత్యేక కథను ఎంచుకోబోతున్నారా అన్నది చూడాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ సినిమా చేస్తున్నాడు బోయపాటి. ఈ మూవీ ఫిబ్రవరికి పూర్తవుతుంది. ఇప్పటికే బాలయ్య వందో సినిమాకు బోయపాటి కథ ఓకే చేయించుకున్నాడట. బన్నీ మూవీ పూర్తయ్యాక పూర్తి స్థాయిలో స్క్రిప్టు పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సినిమా మొదలుపెడతాడని సమాచారం.