‘‘నాది నాది అంటూ నా కూతుర్నే తీసుకెళ్లిపోయాడు’’ అనే మాట బాలయ్య నోటి నుంచి వచ్చింది. అలాగని ఇదేమీ సినిమా డైలాగ్ కాదు. తన నిజ జీవితానికి సంబంధించిన మాటే. మరి ఈ మాట బాలయ్య ఎవరి గురించి అని ఉంటాడో గెస్ చేయడం అంత కష్టమేమీ కాదు. తన పెద్దల్లుడు లోకేష్ బాబు గురించి ఆయనీ వ్యాఖ్య చేశాడు. ఐతే అదేమీ సీరియస్ డైలాగ్ కాదులెండి. సరదాగా అన్నదే. ఇంతకీ బాలయ్య ఈ మాట ఏ సందర్భంలో అనాల్సి వచ్చిందో తెలుసుకుందాం పదండి.
‘‘నా పెద్దల్లుడు లోకేష్ బాబు నా చెల్లెలు భువనేశ్వరి కొడుకు కావడంతో చిన్నప్పటి నుంచి చాలా చనువుగా ఉంటాడు. మేం చెన్నైలో ఉన్నపుడు చెల్లెలు భువనేశ్వరి.. బావ చంద్రబాబు మా ఇంట్లోనే ఉండేవాళ్లు. దీంతో మా ఇంటిని తన ఇంటిగానే భావించేవాడు లోకేష్. చిన్నప్పుడు వాడిని ఆటపట్టించడానికి ఇది నా ఇల్లురా వెళ్లు అనేవాడిని. వాడేమో కాదు.. ఇది నా ఇల్లు అంటూ గోడలు పట్టుకుని నన్ను కోపంగా చూసేవాడు. ఆ తర్వాత నా కూతుర్నే పెళ్లి చేసుకోవడం.. ‘నాది నాది అంటూ నా కూతుర్నే తీసుకెళ్లిపోయావ్’ కదరా అని సరదాగా అంటుంటా’’ అని బాలయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
చిన్నపుడు తాను లోకేష్ ను చూసి ఏమో అనుకున్నానని.. కానీ పెద్దయ్యాక అతడిలో పెద్దరికం వచ్చిందని బాలయ్య అన్నాడు. తెలుగుదేశం పార్టీలో లోకేష్ సామాన్య కార్యకర్తలా ఉంటూ.. క్రమశిక్షణతో మెలుగుతూ.. అందరితో సమన్వయం చేసుకుంటూ కీలక పాత్ర పోషిస్తున్నాడని బాలయ్య కితాబిచ్చాడు. తన రెండో అల్లుడు శ్రీ భరత్ గురించి మాట్లాడుతూ.. అతను అందరితోనూ సులువుగా కలిసిపోతాడని.. మంచి చదువు చదువుకుని గీతమ్ యూనివర్శిటీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని బాలయ్య కితాబిచ్చాడు.