బాల‌య్య మాత్ర‌మే ఆ ఫీట్ చేస్తున్నాడు

Update: 2016-01-05 15:06 GMT
ఈసారి సంక్రాంతికి ఎన్న‌డూ లేనంత సంద‌డి నెల‌కొన‌బోతోంది టాలీవుడ్లో. ఎవ‌రికి వారు ప‌ట్టుద‌ల‌గా పండ‌క్కే సినిమా తేవాల‌ని హ‌డావుడిగా స‌న్నాహాలు చేసుకున్నారు. ఐతే సంక్రాంతికి వ‌స్తున్న సినిమాల్లో ‘డిక్టేట‌ర్’కు ఓ స్పెషాలిటీ ఉంది. మిగ‌తా మూడు తెలుగులో మాత్ర‌మే విడుద‌ల కాబోతుండ‌గా.. ‘డిక్టేట‌ర్’ మాత్రం మ‌రో రెండు భాష‌ల్లోనూ సంక్రాంతికే రిలీజ్ చేయ‌బోతున్నారు. త‌మిళ‌ - మ‌ల‌యాళ డ‌బ్బింగ్ వెర్ష‌న్స్ ప‌నులు కూడా చ‌డీచ‌ప్పుడు కాకుండా జ‌రుగుతున్నాయి. రెండు భాష‌ల్లోనూ చెప్పుకోద‌గ్గ స్థాయిలోనే సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

బాల‌య్య ఇంత‌కుముందు వేరే భాష‌ల్లో త‌న సినిమాను రిలీజ్ చేయ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. కానీ డిక్టేట‌ర్ విష‌యంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఆయ‌న డ‌బ్బింగ్ కు ప‌చ్చ జెండా ఊపాడ‌ట‌. ఓవైపు తెలుగు డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు చేయిస్తూనే త‌మిళ‌ - మ‌ల‌యాళ భాష‌ల అనువాద కార్య‌క్ర‌మాల్ని కూడా ప‌ర్య‌వేక్షిస్తున్నాడు ద‌ర్శ‌క నిర్మాత శ్రీవాస్‌. ఇంత హ‌డావుడిలోనూ వేరే భాష‌ల్లోనూ సినిమాను రిలీజ్ చేయ‌డానికి ఇంత త‌పిస్తుండ‌టం గొప్ప విష‌య‌మే. ఎన్టీఆర్ సినిమా ‘నాన్న‌కు ప్రేమ‌తో’నూ కూడా త‌మిళ‌ - మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు కానీ.. టైం స‌రిపోక ఆ ఆలోచ‌న‌ను ప్ర‌స్తుతానికి హోల్డ్ లో పెట్టారు. విడుద‌ల త‌ర్వాత మంచి టాక్ వ‌స్తే డ‌బ్ చేసి కొంచెం ఆల‌స్యంగా రిలీజ్ చేసే అవ‌కాశాలున్నాయి.
Tags:    

Similar News