నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి ల కాంబోలో రూపొందిన అఖండ సినిమా విడుదల అయ్యి అయిద వారాలు అయ్యింది. ఈమద్య కాలంలో రెండు మూడు వారాలకే సినిమాలు థియేటర్ రన్ క్లోజ్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో అఖండ సినిమా నాలుగు వారాలు కూడా మంచి షేర్ ను రాబట్టడంతో పాటు అయిద వారంలో కూడా ఈ సినిమా వసూళ్ల విషయంలో అందరిని ఆశ్చర్యపర్చుతోంది. సినిమా చిత్రీకరణ మొదలు అయినప్పటి నుండే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు మించి వసూళ్లు చేసింది. 34 రోజులకు గాను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 68 కోట్ల రూపాయలను వసూళ్లను దక్కించుకుంది.
ఇప్పటికి కూడా పలు ఏరియాల్లో మంచి షేర్ ను నమోదు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే స్ట్రీమింగ్ అవ్వల్సిన అఖండ సినిమా ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. అఖండ సినిమా ను మొదటగా నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు గాను హాట్ స్టార్ వారు హక్కులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఈ సినిమాను 21 జనవరి న విడుదల చేయబోతున్నట్లుగా హట్ స్టార్ వారు అధికారికంగా ప్రకటించారు. అంటే ఏడు వారాల తర్వాత మాత్రమే ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈమద్య కాలంలో ఇంత గ్యాప్ తో ఓటీటీ లో విడుదల కావడం ఇదే.
అఖండ సినిమా విడుదల అయ్యింది గత నెల ఆరంభంలో.. నాలుగు వారాల గ్యాప్ లో అంటే ఈ నెల ఆరంభంలోనే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది. కాని అఖండ సినిమా ను ఓటీటీ సంక్రాంతి సీజన్ తర్వాత రాబోతుండటం చర్చనీయాంశం అయ్యింది. అఖండ సంక్రాంతి సీజన్ పై కూడా కన్నేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య సినిమాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు పండుగే. ఆ పండుగకు ఈ సినిమా ను చూడాలని అంతా అనుకుంటారు. అందుకే సంక్రాంతికి థియేటర్ లో అఖండ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి అఖండ సినిమా 50 రోజులు పూర్తి చేసి రికార్డు కొట్టేలా ఉన్నారు.