ముగ్గురిలో ఎవరితో బాలయ్య సెంచరీ?

Update: 2016-01-30 05:19 GMT
నందమూరి బాలకృష్ణ తనకు ఎంతో కీలకమైన వందవ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 99వ సినిమా డిక్టేటర్ ని యావరేజ్  కంటెంట్ తోనూ హిట్ కొట్టించిన సత్తా ఉన్న బాలయ్య.. సెంచరీ విషయంలో మాత్రం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బాలయ్యతో వందో సినిమాకు ఇద్దరు డైరెక్టర్లు పోటీ ఉండగా.. ఇప్పుడు మూడో దర్శకుడు జతయ్యాడు.

పటాస్ ఫేం అనిల్ రావిపూడి - రీసెంట్ గా బాలయ్యని కలిసి ఓ కథ వినిపించాడు. రామారావు గారు టైటిల్ తో వినిపించిన లైన్.. బాలకృష్ణకు నచ్చడంతో.. దీన్ని డెవలప్ చేయాలని సూచించారట. ప్రస్తుతం సాయిధరం తేజ్ తో సుప్రీం చిత్రాన్ని తీస్తున్న అనిల్.. బాలయ్య మూవీపై కూడా గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే సింగీతం శ్రీనివాసరావుతో ఆదిత్య 999కి సీక్వెల్ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. దీనికి తోడు బాలయ్యకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటిని కూడా ఒక స్టోరీ డెవలప్ చేయాలని సూచించారు బాలకృష్ణ.

బోయపాటి శ్రీను - సింగీతం శ్రీనివాస రావు - అనిల్ రావిపూడి.. ముగ్గురూ ఇప్పుడు బాలయ్య కోసం స్టోరీ సిద్ధం చేసుకుంటున్నారు. ముగ్గురిలో ఎవరి ఫైనల్ కంటెంట్ తనకు నచ్చితే, వారితో సినిమా చేయాలని అనుకుంటున్నారట బాలయ్య. కంటెంట్ నచ్చడంతో పాటు.. ఎవరు ముందుగా స్క్రిప్ట్ రెడీ చేసుకువస్తారన్నది కూడా ఇక్కడ పాయింటే. ఎందుకంటే.. వచ్చే సంక్రాంతికి వందో సినిమా రిలీజ్ చేయాలన్నది బాలకృష్ణ ఆలోచన. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో?
Tags:    

Similar News