శ్రీవాస్‌ ను బాలయ్య ఏమని హెచ్చరించాడు?

Update: 2016-01-05 05:34 GMT
సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ పెట్టేస్తే సరిపోదు.. ఆ టైటిల్ కు తగ్గ కంటెంట్ ఉండాలి. లేదంటే నవ్వులపాలై పోవడం ఖాయం. అందుకే ఈ విషయంలో డైరెక్టర్ శ్రీవాస్‌ ను హెచ్చరించానని అంటున్నాడు నందమూరి బాలకృష్ణ. ‘డిక్టేటర్’ టైటిల్ విషయంలో తాను మొదట్నుంచి కొంచెం కంగారుగానే ఉన్నానని.. ఈ విషయంలో డైరెక్టర్ని హెచ్చరిస్తూ వచ్చానని చెప్పాడు బాలయ్య.

‘‘డిక్టేటర్ చాలా పవర్ ఫుల్ టైటిల్. ఊరికే టైటిల్ పెట్టేస్తే సరిపోదు. దానికి తగ్గ కథాకథనాలు ఉండాలి. అందుకే ఆ టైటిల్ మన సబ్జెక్టుకు సరిపోతుందా అని అడిగాను. టైటిల్ కు తగ్గట్లు సినిమా ఉండేలా చూసుకోవాలని హెచ్చరించాను. ఐతే సినిమా పూర్తయ్యాక అందులో ఉన్న భారీతనం చూశాక ఇదే కరెక్ట్ టైటిల్ అనిపించింది’’ అని చెప్పాడు బాలయ్య. ‘డిక్టేటర్’ సినిమా తన అభిమానులకు విందు భోజనంలా ఉంటుందని.. వాళ్లను ఏమాత్రం నిరాశ పరచదని.. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా ఇదని బాలయ్య అన్నాడు.

బాలయ్య సరసన అంజలి - సోనాల్ చౌహాన్ నటించిన ‘డిక్టేటర్’ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ తో కలిసి డైరెక్టర్ శ్రీవాస్ స్వయంగా నిర్మించడం విశేషం. కోన వెంకట్ - గోపీమోహన్ - శ్రీధర్ సీపాన - రత్నం లాంటి నలుగురు ప్రముఖ రచయితలు కలిసి ఈ స్క్రిప్టు రూపొందించారు. ఈ నెల 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Tags:    

Similar News