డిక్టేటర్.. బాలయ్య 99వ సినిమా. ఇంకో ఐదు రోజుల్లో థియేటర్లలో దిగిపోతోంది. సంక్రాంతి రేసులో ఉన్న నాలుగు సినిమాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజవుతోంది డిక్టేటరే. ఐతే తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యకు క్రేజ్ బాగానే ఉంది కానీ.. ఓవర్సీస్ లో ఆయనకు చెప్పుకోదగ్గ మార్కెట్ లేదనే చెప్పాలి. యుఎస్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన టాప్-20 సినిమాల్లో బాలయ్య సినిమాలేవీ లేవు. ఒక్క ‘లెజెండ్’ మాత్రమే అక్కడ ఓ మోస్తరుగా వసూళ్లు సాధించింది. ఐతే ‘డిక్టేటర్’తో ఈ సీన్ మార్చేయాలని బాలయ్య అండ్ కో ఫిక్సయింది. అందుకే ఈ చిత్రాన్ని యుఎస్ లో కాస్త పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు.
బాలయ్య 99వ సినిమాకు సూచికగా ‘డిక్టేటర్’ను యుఎస్ లో 99 థియేటర్లలో రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇది అక్కడ బాలయ్య సినిమాల్లో రికార్డ్ రిలీజ్. ఓ బయ్యర్ - కొందరు బాలయ్య అభిమానులు కలిసి ఎన్నారై టీడీపీ సపోర్ట్ తో ‘డిక్టేటర్’ను యుఎస్ లో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. యుఎస్ రైట్స్ మరీ రేటు కూడా ఏమీ పలకలేదని సమాచారం. విడుదలకు ముందు రోజు, 13నే అక్కడ భారీగా ప్రిమియర్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ షోలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దాదాపు 900 థియేటర్లలో భారీగా రిలీజవుతోంది ‘డిక్టేటర్’. సినిమాకు మంచి టాక్ వస్తే బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ అవుతుందన్న అంచనాలున్నాయి ఈ సినిమా మీద.