బాల‌య్య పాటా మ‌జాకా!

Update: 2015-11-15 04:23 GMT
సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌కొచ్చేస‌రికి వ్య‌వ‌హార‌మంతా హ‌డావుడిగా మారిపోతుంటుంది. ఏదో ఒక‌టి కానిచ్చేద్దాం అన్న‌ట్టు  వ్య‌వ‌హ‌రిస్తుంటారంతా.  ఆ స‌మ‌యంలో భారీ హంగుల జోలికి అస్స‌లు వెళ్ల‌రు.  అయితే బాల‌య్య మాత్రం త‌న సినిమా విడుద‌ల తేదీ ఎంత‌గా ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ప్ప‌టికీ ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌టం లేదు. వేగంగా ప‌నిచేసుకుంటూనే చిత్రానికి  కావాల్సిన భారీ హంగుల‌న్నీ జోడిస్తున్నారు.  బాల‌కృష్ణ న‌టిస్తున్న `డిక్టేట‌ర్‌` ప్ర‌స్తుతం  హైద‌రాబాద్‌ లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. కోటి రూపాయ‌ల వ్య‌యంతో ఓ భారీ సెట్‌ ని తీర్చిదిద్దారు.  అందులో బాల‌కృష్ణ‌ - అంజ‌లిల‌పై ఓ పాట‌ని తెర‌కెక్కిస్తున్నారు. అది చిత్రానికి  ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతోంద‌ట‌. ఆ సెట్ ముందు కూర్చుని  అంజ‌లి తీయించుకొన్న ఓ ఫొటోని ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేసింది.

బాల‌య్య డిక్టేట‌ర్‌ ని సంక్రాంతికి విడుద‌ల చేయాల‌నుకొంటున్నారు. అందుకే శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. న‌టీన‌టులు - టెక్నీషియ‌న్లు రేయింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌కొచ్చిన‌ప్పుడు, అనుకొన్న స‌మ‌యానికి సినిమాని విడుద‌ల చేయాల్సిందే అనుకొన్న‌ప్పుడు ఇలాంటి భారీ సెట్ల జోలికి అస్స‌లు వెళ్ల‌రు. కానీ బాల‌య్య మాత్రం అస్స‌లు  రాజీప‌డ‌టం లేదు. సినిమాకి ఏం అవ‌స‌ర‌మైతే అది చేసేయండి, తాను రేయింబ‌వ‌ళ్లు ప‌నిచేయ‌డానికైనా సిద్ధ‌మే అంటున్నాడ‌ట‌. బాల‌య్య అండ‌తో నిర్మాత‌లు కూడా గ్రాండ్‌ నెస్‌ ని త‌గ్గ‌కుండా చూసుకొంటున్న‌ట్టు తెలిసింది.  సంక్రాంతికి డిక్టేట‌ర్ సంద‌డి చేయ‌డం గ్యారెంటీ.
Tags:    

Similar News