నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిపోగా.. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ పనులను - పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల కానున్న గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్.. రీసెంట్ గా రిలీజ్ అయ్యి.. యూట్యూబ్ లో సంచలనాలకు వేదికగా మారింది.
అయితే.. శాతకర్ణికి సంబంధించి రకరకాల కథనాలు వచ్చేస్తున్నాయి. హిందీ సినిమాలో కాపీ సీన్లు వాడారు వంటి నెగిటివ్ టాక్ సోషల్ మీడియా లో కావాలని స్ప్రెడ్ చేశారట . శాతకర్ణి యూనిట్ దీనిని ఖండించినా.. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుడుతున్నాయనే అంశంపై ఆరా తీస్తున్నారట బాలయ్య. అనేక అంచనాలు ఉన్న ఈ చిత్రంపై నెగిటివ్ పబ్లిసిటీ చేయడానికి మూలం ఎక్కుడుంది అనే అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది.
బాలయ్య సన్నిహితులు ఇప్పటికే ఈ విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారని.. ప్రతికూల ప్రచారం చేస్తున్నవారిని సీరియస్ గా హ్యాండిల్ చేయాలని భావిస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరి బాలకృష్ణ చిత్రంపై అంత పని కట్టుకుని నెగిటివ్ లీక్స్ ఇస్తోంది ఎవరనే అంశం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/