ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రానికి ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ వుంది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్సీస్ లోనూ బాగా డిమాండ్ వుంది. దాంతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పోటీ పడి ఫ్యాన్సీ రేట్లను ఆఫర్ చేస్తున్నా.. చిత్ర నిర్మాతలు మాత్రం ఇంకా వాటిని ఎవరికీ ఇవ్వడానికి సుముఖంగా లేరనే ప్రచారం జరుగుతోంది. గతంలోనే ఓవర్సీస్ రైట్స్ ను ఓ సంస్థ రూ.4.44 కోట్లకు దక్కించుకోవడానికి ముందుకు వచ్చినా... నిర్మాతలు ఇవ్వలేదనే ప్రచారం వుంది. దానికి కారణం బాలయ్య ఫ్యాన్స్ నుంచి కూడా ప్రపోజల్స్ రావడమే కారణమని చెబుతున్నారు. దాంతో ఓవర్సీస్ రైట్స్ కూడా హోల్డ్ లోనే పెట్టేశారు నిర్మాతలు
అలాగే ఇప్పుడు తూర్పుగోదావరి థియేట్రికల్ రైట్స్ ను వింటేజ్ సంస్థ దక్కించుకుందనే ప్రచారం వుంది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదట. ఈస్ట్ రైట్స్ కాదు.. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేయలేదట. దానికి కారణం కూడా బాలయ్యకు అత్యంత ఆప్తాతులెవరైనా.. చివరి నిమిషంలో పోటీకి వస్తే... ముందుగా అమ్మేసిన రైట్స్ విషయంలో పేచీ వస్తుందనే ఉద్దేశంతో అలాగే వుంచారట. ప్రస్తుతం క్రిష్ పెళ్లి పనుల్లో బిజీగా వున్నాడు. ఇటీవలే ఫారిన్ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుని తిరిగొచ్చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ ఓ వైపు వేగంగా జరుపుతున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.
బాలయ్య వందో చిత్రం కావడంతో ఈ చిత్రం బిజినెస్ రికార్డు స్థాయిలోనే అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. పంపిణీ దారులు కూడా అందుకు తగ్గట్టుగానే ఫ్యాన్సీ రేట్స్ ఇవ్వడానికి ముందుకొస్తున్నా... నిర్మాతలు ఇప్పటికిప్పుడే ఇచ్చేందుకు రెడీగా లేరంట. చూడాలి.. మరి నిర్మాతలు ఈ చిత్రానికి ఏమాత్రం బిజినెస్ చేసి రికార్డులు సృష్టిస్తారో!