ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా పండగలు వస్తే సినిమాలను రిలీజ్ చేయడం కామన్. అభిమానులు ఆనందంగా ఉన్న వాతావరణంలో రిలీజ్ చేస్తే మనం కూడా కలెక్షన్స్ తో ఆనందంగా ఉండవచ్చు అని నిర్మాతలు సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి పండగలకి సినిమాను రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటారు. అంతే కాకుండా ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేస్తుంటారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాకు సంబంధించి ఎదో ఒక న్యూస్ తో సినిమాకు హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తారు.
ప్రమోషన్స్ లో మన తెలుగు సినీ కళా కారులు చాలా రాటు దెలరని చెప్పవచ్చు. సినిమా ఎలా ఉంది అన్నది తరువాత సంగతి. ముందు సినిమా కి హైప్ క్రియేట్ అయ్యిందా లేదా అన్నదే ముఖ్యం. ఇకపోతే తెలుగులో ఈ సంక్రాంతికి కొన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి - బాలకృష్ణ జై సింహ సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని ఆ చిత్ర యూనిట్ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అజ్ఞాతవాసి సినిమా క్రేజ్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటలతో పోస్టర్లతో జనాలను చాలా ఆకట్టుకుంటోంది. అందులోను పవన్ కళ్యాణ్ సినిమా. అంతే కాకుండా త్రివిక్రమ్ డైరెక్షన్. ఇంతకంటే సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్ ఏం ఉండాలి. కానీ బాలయ్య విషయానికి వస్తే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కూడా ఏ మాంత్రం సందడి లేదు.
గత సంక్రాంతికి మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 పోటీకి వచ్చినా కూడా బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణితో గట్టి పోటీ ఇచ్చాడు. అందుకు కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పాలి. చారిత్రాత్మక చిత్రం కావడం అలాగే క్రిష్ డైరెక్షన్ వంటి విషయాలు జనాలను బాగా ఆకర్షించాయి. దానికితోడు ప్రమోషన్ అదిరిపోయింది. కానీ జై సింహ రెగ్యులర్ కమర్షియల్ సినిమా. అందులోను దర్శకుడు కెఎస్.రవికుమార్ ఫామ్ లో లేడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జై సింహ చిత్ర యూనిట్ ఎదో ఒక ప్రమోషన్ తో హైప్ క్రియేట్ చేయాలి. కానీ సందడి ఏం కనిపించడం లేదు. ఇలాగైతే సింహ గర్జన ఎలా కుదురుతుంది?