మహానటి సినిమా వలన టాలీవుడ్ లో మరికొంత మార్పు వచ్చింది అని అర్థమైపోయింది. బయోపిక్ ని అర్థవంతంగా తెరకెక్కిస్తే చూసేందుకు ప్రేక్షకులు ఏ మాత్రం వెనుకాడరని కొత్త దర్శకుడైనా నాగ్ అశ్విన్ అద్భుతంగా చెప్పేశాడు. సీనియర్ దర్శకులు చేయలేని పని కొత్త దర్శకుడు చేశాడని అందరు ప్రశంసలు కురిపించారు. అయితే సినిమా విడుదల ముందు అసలు బయోపిక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే సందేహాలు చాలా మందిలో మెదిలాయి.
అదే విధంగా ఎన్టీఆర్ బయోపిక్ పై కూడా అనుమానాలు రేగాయి. పైగా ఆ సినిమా షూటింగ్ కూడా సరిగ్గా మొదలవ్వలేదు. ఎప్పుడైతే మహానటి అద్భుత విజయం అందుకుందో బాలకృష్ణ కూడా తన సినిమా ఎలాగైనా విజయం సాధించాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఒక యువ దర్శకుడు ముందుండి సావిత్రి కథను నడిపించాడు. అలాంటిది ఇంత బలగం ఉండి ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుల కథలను తెరకెక్కించలేమా? అని తన టీమ్ తో చర్చలు బాగానే జరిపారట.
ఇక ఫైనల్ గా దర్శకుడు తేజని బుజ్జగించి వెనక్కి రప్పించేందుకు సన్నాహకాలు చేస్తున్నారట. బాలకృష్ణ రిక్వెస్ట్ చేస్తే తేజ రాకపోవడం అనేది అసంభవం. తప్పకుండా తేజ ఎన్టీఆర్ కథను కంటిన్యూ చేస్తాడని సమాచారం అందుతోంది. పైగా ముందు నుంచి కథను రెడీ చేయడంలో ఎక్కువగా రీసెర్చ్ చేసింది తేజనే. దీంతో అతనిని రప్పించేందుకు కొంత మంది మధ్యవర్తులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారని టాక్.