అమరావతిలోనే డిక్టేటర్ ఎందుకంటే...

Update: 2015-12-17 19:30 GMT
నవ్యాంధ్ర నయా రాజధాని అమరావతిలో బాలకృష్ణ డిక్టేటర్ ఆడియో లాంఛింగ్ కి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమరావతిలో ఇంతటి సినిమా ఫంక్షన్ జరుపుకుంటున్న తొలి మూవీగా డిక్టేటర్ కొత్త రికార్డ్ సృష్టించనుంది. మరోవైపు అసలు ఇక్కడే డిక్టేటర్ ఫంక్షన్ ఎందుకు చేయాలనే ప్రశ్నకు.. బాలయ్య ఫ్యాన్స్ చెబుతున్న కారణం సబబుగానే అనిపిస్తోంది.

నవ్యాంధ్రకు కీలక రంగాలను తరలించాలన్నది ఏపీ ప్రభుత్వం యోచన. అన్నిటితో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా ఇందులో ఉంటుందనే మాటను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. మరోవైపు ఏపీకి సినిమా ఇండస్ట్రీ తరలిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ.. తెలంగాణ ప్రభుత్వం తరపున కేటీఆర్ ఓపెన్ గానే చెప్పారు. ఇప్పుడు ప్రశ్న ఏపీకి సినిమా ఇండస్ట్రీని ఆకర్షించడం ఎలా ?  హైదరాబాద్ లో ఉన్నంతగా సౌకర్యాలు లేకుండానే ఆంధ్రలో పెద్ద ఫంక్షన్స్ నిర్వహించడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. వీటిన్నిటికీ డిక్టేటర్ ద్వారా డిక్టేటర్ సమాధానం చెప్పబోతున్నాడు. బాలకృష్ణ ఏపీ ప్రభుత్వంలో ఒక భాగం అనే మాటను మర్చిపోకూడదు. మరోవైపు అమరావతిలో ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా బోలెడు ప్రచారం వస్తుంది. అటు డిక్టేటర్ కి, ఇటు అమరావతి కూడా పబ్లిసిటీ ఖాయం.

మిగిలిన ఏ రంగం కంటే అయినా.. సినిమా ఇండస్ట్రీ మీద జనాల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బాలయ్య డిక్టేటర్ ఆడియో ఫంక్షన్ ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించడం ద్వారా.. ఏపీలో సినిమా వేడుకలు ఎంత ఘనంగా చేయచ్చనే విషయాన్ని ప్రూవ్ చేయబోతున్నారని.. బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. నందమూరి అభిమానుల వెర్షన్ లో లాజిక్ ఉందని అనిపిస్తోంది కదూ.
Tags:    

Similar News