రచయిత అనిల్ రావిపూడి 'పటాస్'తో దర్శకుడిగా మారాడు. కళ్యాణ్‌రామ్‌కి ఓ భారీ కమర్షియల్ హిట్టు ఇవ్వడంతో పాటు, తానూ తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకొన్నాడు. ఇప్పుడు ఆయన టాలెంట్‌ని నందమూరి కాంపౌండ్ బాగా వాడుకోవాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బాలకృష్ణ 99వ చిత్రానికి అనిల్ రావిపూడి ఓ రచయితగా పనిచేస్తున్నారు. మంచి కామిక్ సెన్స్ ఉన్న అనిల్ బాలయ్య చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్‌ని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా తెలిసిన సమాచారం మేరకు... అనిల్ దర్శకత్వంలోనూ బాలకృష్ణ ఓ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
బాబాయ్ బాలకృష్ణతోనూ, తమ్ముడు ఎన్టీఆర్‌తోనూ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలో సినిమాలు తీయాలనే ఆలోచన కళ్యాణ్‌రామ్‌కి ఎప్పట్నుంచో ఉంది. అందుకే తనకి హిట్టిచ్చిన అనిల్‌పై నమ్మకంతో బాబాయ్ కోసం ఓ కథ తయారు చేయమని చెప్పాడట. ఆయన ఇప్పటికే కథ కూడా సిద్ధం చేశారని సమాచారం. అన్నీ కుదిరితే బాలకృష్ణ వందో చిత్రమే అనిల్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 'లయన్' ఆడియో ఫంక్షన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శ్రీవాస్‌తో పాటు, అనిల్‌ని కూడా బాలకృష్ణ పరిచయం చేశారట. వీళ్లిద్దరూ నాతో తదుపరి సినిమాలు చేస్తారని స్పష్టంగా చెప్పారని తెలిసింది