నందమూరి బాలకృష్ణ తన కొత్త చిత్రం రూలర్ కోసం షాకింగ్ అవతారంలోకి మారాడు. బాగా బరువు తగ్గి కొత్త విగ్ తయారు చేయించుకుని.. గడ్డం - మీసకట్టు మార్చేసి ట్రెండీగా తయారయ్యాడు బాలయ్య. ఇది హాలీవుడ్ సూపర్ స్టార్ టోనీ స్టార్క్ ను పోలిన లుక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే బాలయ్య ఉద్దేశపూర్వకంగా ఆ నటుడిని ఫాలో అయ్యాడో.. యాదృచ్ఛికంగా జరిగిందా అన్నది తెలియలేదు. ఐతే రూలర్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ లుక్ వెనుక అసలు కథను వెల్లడించాడు బాలయ్య. ఒక అభిమాని ఇచ్చిన సలహా వల్లే తాను ఈ లుక్ లోకి మారినట్లు బాలయ్య తెలిపాడు.
కొన్నేళ్ల కిందట తన అభిమాని ఒకరు టోనీ స్టార్క్ ఫొటో ఒకటి పంపించి.. ఇలాంటి లుక్ తనకు బాగుంటుందని సలహా ఇచ్చాడని బాలయ్య చెప్పాడు. అది తనకూ బాగుందనిపించిందని.. కానీ తర్వాత ఆ సంగతి మరిచిపోయానని.. రూలర్ సినిమా కథ చెప్పి తన లుక్ గురించి డిస్కషన్ వచ్చినపుడు తనకు ఈ విషయం గుర్తొచ్చి టోనీ స్టార్క్ లుక్ ట్రై చేద్దామని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తో చెప్పానని.. ఆయన సరే అనడంతో కష్టపడి ఆ లుక్ లోకి మారానని.. ఈ లుక్ కు అభిమానుల నుంచి చాలా మంచి స్పందన వచ్చిందని బాలయ్య చెప్పాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా అభిమానులు తనను టోనీ స్టార్క్ టోనీ స్టార్క్ అంటున్నారని బాలయ్య తెలిపాడు. మొత్తానికి బాలయ్య కొత్త లుక్ వెనుక ఉన్నది ఒక అభిమాని కావడం విశేషమే. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ - వేదిక నటించిన రూలర్ ఈ నెల 20నే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.