డేట్ ఫిక్స్.. బాలయ్య మాత్రం రాడు

Update: 2015-12-22 09:30 GMT
‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్ విషయంలో ఇక రూమర్లు కట్టి పెట్టేయొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తండ్రి మరణం నేపథ్యంలో ఆడియో ఫంక్షన్ ఈ నెల్లోనే జరుగుతుందా లేదా.. ఈ ఫంక్షన్ కు ఎన్టీఆర్ బాబాయి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతాడా లేదా అన్న విషయంలో ఇక సస్పెన్స్ ఏమీ లేదు.

కొన్ని రోజులుగా అనుకుంటున్నట్లే ఈ నెల 27న, ఆదివారం ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్ జరగబోతోంది. తండ్రి మరణం తాలూకు విషాదంలోనే దేవిశ్రీ ఆడియో బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేశాడు. ‘నేను శైలజ’ ఆడియో ఫంక్షన్ కు దూరంగా ఉండి మరీ దేవి ‘నాన్నకు ప్రేమతో’ పని మీద దృష్టిపెట్టాడు.

ఇక బాలయ్య ఆడియో ఫంక్షన్ కు వస్తాడన్నది రూమర్ మాత్రమే. బాలయ్య - ఎన్టీఆర్ ప్యాచప్ అయితే అయ్యుండొచ్చు కానీ.. ఆ ఫంక్షన్ కు మాత్రం ఆయన రాకపోవచ్చని సమాచారం. ఈ ఫంక్షన్ జరిగే టైంలో ‘డిక్టేటర్’ ఫైనల్ సాంగ్ చిత్రీకరణలో ఉంటాడట బాలయ్య. కాబట్టి బాబాయి - అబ్బాయిలను నందమూరి అభమానులు ఒకే వేదికపై చూడటం అన్నది డౌటే అంటున్నారు.
Tags:    

Similar News