బాలయ్య స్పీడు సూపర్.. మరి క్వాలిటీ?

Update: 2017-12-03 03:30 GMT
నందమూరి బాలకృష్ణ స్పీడు మామూలుగా లేదు. ఈ ఏడాది ఆరంభంలో మార్చి వరకు ఆయన ఖాళీగానే ఉన్నారు. కానీ నవంబరు నెల పూర్తయ్యేసరికి ఆయన రెండు సినిమాల షూటింగ్ అవగొట్టేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాలుగే నాలుగు నెలల్లో ‘పైసా వసూల్’ సినిమా పూర్తి చేశాడు బాలయ్య. సెప్టెంబరు నెలాఖరుకు అనుకున్న ఈ సినిమాను ఆశ్చర్యకరంగా నెల రోజుల ముందే రిలీజ్ చేయడం విశేషం.

ఆ సినిమా షూటింగ్ పూర్తి కావడం ఆలస్యం.. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ‘జై సింహా’ మొదలుపెట్టేశాడు. ఈ సినిమాను కూడా అదే స్పీడుతో పూర్తి చేసేశాడు బాలయ్య. ఈ చిత్ర టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ఇక రెండు మూడు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలుందట. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి ముందు ప్రకటించినట్లే జనవరి 12న ‘జై సింహా’ను ప్రేక్షకుల ముందుకు తేవడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం.

ఈ వయసులో బాలయ్య ఇంత స్పీడుగా సినిమాలు పూర్తి చేయడం మంచి విషయమే కానీ.. ఈ స్పీడులో సినిమా క్వాలిటీ ఎలా వస్తోందో కూడా కొంచెం చూసుకోవాలి. ‘పైసా వసూల్’ సినిమాను అనుకున్న దాని కంటే ముందే రిలీజ్ చేయడం రికార్డే అయినప్పటికీ.. ఆ సినిమా ఫలితం ఏమైందో తెలిసిందే. ‘జై సింహా’ విషయంలోనూ అభిమానులు ఏమంత కాన్ఫిడెంటుగా లేరు. కె.ఎస్.రవికుమార్ ట్రాక్ రికార్డు వాళ్లను భయపెడుతోంది. అందులోనూ సంక్రాంతికి భారీ సినిమాల మధ్య బరిలోకి దిగుతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో అన్న సందేహాలున్నాయి.
Tags:    

Similar News