ఈ ఏడాది జైసింహా సినిమాతో ఇండస్ట్రీకి తొలి హిట్ అందించిన బాలకృష్ణ దీని తరవాత తన తండ్రి.. విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత గాథతో తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు. రానా హీరోగా నటించిన నేనే రాజు - నేనే మంత్రి సినిమాతో పొలిటికల్ జోనర్ లో సినిమా బాగా తీయగలడని ప్రూవ్ చేసుకున్న తేజను దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది.
ఎన్టీఆర్ బయోపిక్ కు ఈ నెలాఖరును శ్రీకారం చుట్టినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మరో నాలుగు నెలల తరవాతే ప్రారంభించనున్నారు. డైరెక్టర్ తేజ ఈ టైంలో వెంకటేష్ తో కమిట్ అయిన సినిమా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ లెక్కన ప్రస్తుతం బాలయ్య చేతిలో ఉన్న టైము ఓ మామూలు సినిమా చేయడానికి సరిపోతుంది. జైసింహాతో తనకు హిట్టిచ్చిన ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ తరవాత ఇంటలిజెంట్ సినిమాతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడంతో ఆయనను ఆదుకునేందుకు ఓ సినిమా చేస్తానని బాలయ్య భరోసా ఇచ్చాడు. కానీ సి.కళ్యాణ్ సినిమాపై ఇంకా క్లారిటీకి రాలేదు. ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. దీంతో బాలయ్య ఈ టైంలో రాజకీయాలపై ఫోకస్ ఆలోచనలో ఉన్నాడని కొందరు సన్నిహితులు చెబుతున్నారు.
ఈమధ్య వరస ఫాపుల్లో ఉన్న 'రచ్చ' డైరెక్టర్ సంపత్ నంది బాలయ్యతో ఓ సినిమా తీద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్నాడు. ఇప్పటికే స్టోరీ కూడా నెరేట్ చేశాడు. కానీ బాలయ్య మాత్రం ఇంకా ఓకే చెయ్యలేదు. ఒకవేళ పొలిటికల్ గా బిజీ కాని పక్షంలో ఇంకో సినిమా చేద్దామని అనుకుంటే అతడికి ఓకే చెప్పే అవకాశం ఉంది. ఈలోగా సి.కళ్యాణ్ గనుక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయిపోతే సంపత్ నంది మరికొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూడాలి.. బాలయ్య పాలిటిక్స్ వైపు చూస్తాడో.. సినిమానే చేస్తాడో?