హీరో-డైరెక్టరే డిసైడ్ చేసేస్తారా? -బాలయ్య

Update: 2018-01-24 06:30 GMT
సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో మిగతా వాటిని పక్కనపెట్టి జైసింహా మంచి కలెక్షన్లు దక్కించుకుంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోని బయ్యర్లకు ఈ సినిమా లాభాలను తెచ్చిపెడుతోంది. బాలకృష్ణకు సంక్రాంతి సీజన్ కలిసొస్తుందనే సెంటిమెంట్ ను నిజం చేస్తూ జై సింహా రూ. 50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉంది.

ఈ సినిమా సాధించిన రికార్డుల గురించి బాలయ్య వద్ద ప్రస్తావిస్తే రికార్డులు అనేవి ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయని..  సినిమా డబ్బులు పెట్టుబడి పెట్టిన నిర్మాత డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారా లేరా అన్నదే ఇంపార్టెంట్ అంటున్నారు ‘‘సక్సెస్ కు పొంగిపోయేది లేదు.. ఫెయిల్యూర్ ఫీలయ్యేది లేదు. నా పని నేను చేసుకోవడమే నా స్టయిల్’’ అంటున్నారు హీరో బాలయ్య. ఇండస్ట్రీలో నిర్మాతలకు వాల్యూ ఇచ్చే హీరోగా బాలకృష్ణకు గుర్తింపు ఉంది. ఈ రోజుల్లో నిర్మాతలకు విలువ తగ్గిపోతోందని.. ఇది బాధాకరమైన పరిణామమని అంటున్నారు బాలయ్య.

‘‘డైరెక్టర్ - హీరో ఓ గదిలో కలిసి కూర్చుని వాళ్లే అన్నీ మాట్లాడేసుకుంటారు. కనీసం ప్రొడ్యూసర్ కు తమ మనసులోని మాట ఇదని చెప్పరు. అన్నీ వాళ్లే డిసైడ్ చేసేస్తారు. ఈ పద్ధతైతే కరెక్ట్ కాదు. కచ్చితంగా ప్రొడ్యూసర్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి. నా వరకు ప్రొడ్యూసర్ కు ప్రతి విషయం చెబుతాను’’ అంటూ ఇండస్ట్రీకి వెన్నెముక అయిన నిర్మాతల పట్ల తనకున్న గౌరవాన్ని చాటారు బాలకృష్ణ.
Tags:    

Similar News