లెజెండ్ సినిమాతో రికార్డ్ హిట్ అందుకున్నాడు బాలయ్య. 365రోజులు ఈ సినిమా ఒకే థియేటర్‌లో ఆడింది అంటే అర్థం చేసుకోవచ్చు. పెరిగిన క్రేజుతో బాలయ్య రెట్టించిన ఉత్సాహాన్ని తనలో నింపుకున్నాడు. హిందూపురం ఎమ్మెల్యే అయ్యాక బాలయ్య నటిస్తున్న తొలిసినిమా 'లయన్' కాబట్టి లయన్ ఆడియోని టీడీపీ కార్యకర్తలు, నేతల సమక్షంలో ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
రాజకీయనేతలు పసుపురంగు చొక్కాలతో ఆడియో గ్యాలరీ నిండిపోతే అది ఎలా ఉంటుందో? ఓసారి ఊహించండి. ఒక మినీ మహానాడుని తలపించదూ? రాష్ట్రం నలుమూలల నుంచి బాలయ్య అభిమానులంతా లయన్ ఆడియోకి విచ్చేస్తున్నారని సమాచారం. అయితే ఇది మండే వేసవి. కాబట్టి అందరికీ ఆడియో వేదిక వద్ద వసతులు తప్పనిసరి. ముఖ్యంగా దాహం తీర్చడానికి వాటర్ బాటిల్స్, ఆకలేస్తే తిండి, వెల్‌కమ్ జ్యూసెస్ ఇలా అన్నిటినీ ఏర్పాటు చేయాల్సిందిగా బాలయ్య సూచించారట. కార్యకర్తలకు ఏమాత్రం అసౌకర్యం కలగకూడదని, అలాగే పార్టీ నుంచి పరిమితంగా పిలవాల్సిందిగా చెప్పారట. అనవసర ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారట. బాలయ్య మనసు వెన్నపూస అనడానికి ఇంతకంటే ఏం కావాలి?