ఆ విషయాల్లో బాలకృష్ణ సూపరంతే!

Update: 2015-04-10 05:23 GMT
    హిట్టిచ్చిన దర్శకుల వెంటపడటం చాలా మంది కథానాయకులు చేసే పనే. హిట్టు సినిమాలున్న నిర్మాతలతోనే వాళ్లు సినిమాలు చేయాలని ప్రయత్నించడం కూడా చూస్తూనే ఉంటాం. కానీ బాలకృష్ణ మాత్రం ఆ లెక్కల్ని పట్టించుకోరు. కథ నచ్చితే చాలు... కొత్త, పాత అనే తేడా లేకుండా సినిమా చేస్తుంటారు. నిర్మాతల విషయంలోనూ అంతే. లయన్‌ చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు నందమూరి బాలకృష్ణ అభిమాని. ఆయనకి సినిమా పరిశ్రమలో పెద్దగా అనుభవం కూడా లేదు. కానీ ఆయనతో సినిమా చేశారు బాలకృష్ణ. దర్శకుడు సత్యదేవా కూడా కొత్తోడే. ఎప్పుడో వినిపించిన కథని గుర్తు పెట్టుకొని మరీ ఆయన్ని పిలిచి అవకాశమిచ్చాడు. ఆ విషయాలు పరిశ్రమనీ, అభిమానుల్ని బాగా ఆకట్టుకొంటున్నాయి.

     ట్రెండ్‌ని నమ్మడం, కాలానికి తగ్గట్టుగా అడుగేయాలనుకోవడం బాలకృష్ణకి నచ్చదు. నాన్నగారితో పాటే కాలం పరిగెత్తేది, నేనూ అదే చేస్తున్నా అంటున్నారాయన. రేపు ఈ అభిమానుల్లో ఎవరో ఒకరు నా సినిమాకి నిర్మాత కావొచ్చు అని ఆడియో ఫంక్షన్‌లో చెప్పారు బాలకృష్ణ. ఆ మాటకి అభిమానుల నుంచి పెద్దయెత్తున స్పందన లభించింది.
Tags:    

Similar News