నాగబాబు వ్యాఖ్యలపై బాలయ్య రియాక్షన్‌!

Update: 2019-01-08 08:08 GMT
వరుసగా నాగబాబు చేస్తున్న కామెంట్స్‌ తో నందమూరి ఫ్యాన్స్‌ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎప్పుడో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను పట్టుకుని ఇప్పుడు విమర్శలు చేయడంపై నందమూరి ఫ్యాన్స్‌ ఎవరికి తోచినట్లుగా వారు నాగబాబుపై విమర్శలు చేస్తున్నారు. మరో వైపు బాలకృష్ణ తన ‘ఎన్టీఆర్‌’ చిత్రం ప్రమోషన్‌ లో బిజీగా ఉన్నాడు. నిన్న బెంగళూరు వెళ్లిన బాలకృష్ణ నేడు చిత్ర యూనిట్‌ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లాడు. తిరుపతిలో ఒక విలేకరి బాలకృష్ణ ను నాగబాబు వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరాడు. పలువురు నాగబాబు వ్యాఖ్యలపై స్పందన ఏంటీ అంటూ బాలకృష్ణ ను ప్రశ్నించారు.

నాగబాబు వ్యాఖ్యలపై నో కామెంట్‌ అంటూ బాలకృష్ణ చాలా లైట్‌ గా బదులిచ్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ దృష్టి అంతా కూడా ‘ఎన్టీఆర్‌’ చిత్రం పైనే ఉంది. కనుక ఇప్పుడు ఆ విషయంపై బాలకృష్ణ స్పందించక పోయి ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలకృష్ణ స్పందించక పోవడమే మంచిదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో పీజేఆర్‌ మూవీ ల్యాండ్స్‌ లో చిత్ర యూనిట్‌ సభ్యులతో కలిసి సందడి చేసిన బాలకృష్ణ సినిమా గురించి పలు విషయాలను మీడియాతో షేర్‌ చేసుకున్నాడు.

సీఎంగా ఎన్టీఆర్‌ మొదటి సారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు జనవరి 9 - ఆ తేదీనే మా సినిమాను విడుదల చేస్తున్నాం. ఇది యాదృచ్చికంగా జరుగుతుంది. నాన్నగారి స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను - ఆయన బయోపిక్‌ తీసి కొంతైనా ఆయన రుణం తీర్చుకుంటున్నాను. బసవతారకం హాస్పిటల్‌ స్థాపించి అమ్మ రుణం కొంత మేరకు తీర్చుకున్నాను. ఇప్పుడు నాన్న రుణం తీర్చుకునేందుకు ఈ సినిమా చేశానంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. అమ్మ పాత్రలో విద్యాబాలన్‌ అద్బుతంగా చేసింది - ఆమె ఈ పాత్రకు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. కుమారుడు తండ్రి పాత్రను పోషించడం ప్రపంచంలోనే రికార్డు. ఆ అరుదైన అవకాశం నాకు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతుడినన్నారు.




Tags:    

Similar News