తింటే గారెలు తినాలి, వింటే ఎన్టీవోడి డైలాగులు వినాలని నాటి జనరేషన్ తెలుగు ప్రేక్షకుడు అనుకునేవాడు. తెలుగు సినీ పరిశ్రమను ఏలిన నందమూరి తారక రామారావు చేయని పౌరాణిక పాత్ర అంటూ బహుశా ఏదీ మిలిగి ఉండదు. ఎన్టీఆర్ డైలాగు చెబితే ఎలా ఉంటుందో తెలుగువారికి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. క్లిష్టమైన సమాసాలున్నా, కష్టమైన సంస్కృత పదాలున్నా, లెంగ్త్ ఎన్ని పేజీలున్నా సింగిల్ టేక్ లో అనర్గళంగా డైలాగులు చెప్పేయడం అన్నగారికే సాధ్యం! ఇక, నేటితరం టాప్ హీరోల విషయానికొస్తే భారీ డైలాగులు అనగానే అందరికీ గుర్తొచ్చేది బాలయ్యే. రాజసం, పౌరుషం ఉట్టిపడేలా డైలాగులు చెప్పే దమ్మున్న నేటి నటుల్లో బాలయ్య నంబర్ వన్ అనడంలో సందేహం ఉండదు!
ఏవైనా సభలూ ఇతర కార్యక్రమాలకు బాలకృష్ణ వస్తే ఆయన ఏదో ఒక భారీ డైలాగు చెప్తే బాగుండు అని అభిమానులు ఎదురుచూస్తారు. తాజాగా విమానంలో ప్రయానిస్తుండగా బాలయ్య ఓ భారీ డైలాగు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. విమానంలో బాలయ్య పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడు పౌరాణిక చిత్రాలను ఐప్యాడ్ లో చూస్తూ ఉన్నాడు. అతడిని బాలయ్య గమనించారు. దాంతో అతడు కూడా బాలయ్యను మర్యాదపూర్వకంగా పలకరించి... సరదాగా ఒక డైలాగు చెబుతారా సార్ అని అడగ్గానే బాలయ్య ఒప్పుకున్నారు.
మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలోని ఒక భారీ డైలాగులును గుక్కతిప్పుకోకుండా... ఒక పక్క ప్లే అవుతున్న ఆ చిత్రం క్లిప్పింగ్ తో ఏమాత్రం నాన్ సింక్ కాకుండా పక్కా టైమింగ్ లో బాలయ్య చెప్పేశారు. ఇదంతా వీడియో తీశారు. ఆ వీడియో ఇదిగో ఇలా యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. డైలాగులు చెప్పడంలో బాలయ్యకు బాలయ్యే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/