ఆ సినిమాల‌న్నీ తీస్తానంటున్న బాల‌య్య‌

Update: 2018-01-25 07:33 GMT
పేరుకు ఎమ్మెల్యే అయినా..రాష్ట్ర ముఖ్య‌మంత్రి కంటే సో ప‌వ‌ర్ ఫుల్ అంటుంటారు నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఉద్దేశించి కొంద‌రు. నిజ‌మే మ‌రి.. ముఖ్య‌మంత్రి స్వ‌యంగా బావ కావ‌టం..అక్క‌డితో రిలేష‌న్ ఆగ‌కుండా వియ్యంకుడిగా మార‌టంతో బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది.

అంతేనా.. బాల‌య్య ఇంటి అల్లుడు రానున్న రోజుల్లో పెద్ద‌బాబు త‌ర్వాత చిన్న‌బాబు కావ‌టంతో ఆయ‌న‌కు ఎదురు చెప్పేవారు.. ప్ర‌శ్న‌లు వేసే వారు ఎవ‌రుంటారు చెప్పండి. ఇంత ప‌వ‌ర్ ఉన్నా.. లేనిపోని ఇష్యూల్లోకి వెళ్లి అన‌వ‌స‌ర‌మైన త‌ల‌నొప్పులు తెచ్చుకోకుండా జాగ్ర‌త్త‌గా ఉండే బాల‌య్య‌.. ఉన్న‌ట్లుండి ఏమైందో కానీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వినియోగించే చాంబ‌ర్లో.. ఆయ‌న కుర్చీలాంటి దాన్లో కూర్చొని అధికారుల‌తో రివ్యూ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.

సీఎం దేశంలో లేని వేళ‌.. బాల‌య్య సీన్లోకి వ‌చ్చి ఈ రీతిలో చంద్ర‌బాబు ఛాంబ‌ర్ ను వినియోగించ‌టాన్ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యం మీద ఇప్ప‌టివ‌ర‌కూ బాల‌య్య స్పందించ‌న‌ప్ప‌టికీ.. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం మాత్రం రియాక్ట్ అయ్యింది. బాల‌య్య కూర్చున్న కుర్చీ బాబు కూర్చునే కుర్చీ కాద‌ని చెప్పింది. ఇదిలా ఉంటే.. తాజాగా గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని సీతాన‌గ‌రం విజ‌య‌కీలాద్రిపై జ‌రుగుతున్న బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్నారు బాల‌కృష్ణ‌.

ఈ సంద‌ర్భంగా విలేక‌రులతో మాట్లాడిన ఆయ‌న‌.. త‌న తండ్రి తీయ‌కుండా ఉన్న సినిమాల్ని తాను పూర్తి చేస్తాన‌ని చెప్పారు. త‌న తండ్రి తీయాల‌ని తీయ‌లేక‌పోయిన రామానుజ‌చార్య సినిమాను త్వ‌ర‌లో తాను చేయ‌నున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. రామానుజచార్య ఆధ్యాత్మిక‌వేత్త.. గురువు మాత్ర‌మే కాద‌ని.. వేలాది సంవ‌త్స‌రాల కింద‌టే ద‌ళితుల‌కు స‌మాజంలో స‌రైన గుర్తింపు క‌ల్పించిన వ్య‌క్తిగా చెప్పారు.

త‌న తండ్రి తీయాల‌నుకొని తీయ‌లేని సినిమాల గురించి మాట్లాడిన బాల‌కృష్ణ‌.. ఏపీ ముఖ్య‌మంత్రి ఛాంబ‌ర్లో తాను కూర్చున్న కుర్చీ మీద న‌డుస్తున్న వివాదం గురించి మాత్రం మాట్లాడ‌లేదు. అన్ని మీడియా సంస్థ‌ల్లో వ‌చ్చిన ఈ వైనంపై బాల‌య్య అస్స‌లు ప‌ట్ట‌న‌ట్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News