బాల‌య్య ఆ సినిమా చూశాడ‌హో

Update: 2016-02-16 13:54 GMT
తాను త‌న సినిమాలు, త‌న తండ్రి సినిమాలు త‌ప్ప వేరే చూడ‌న‌ని అంటుంటాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అరుదుగా మాత్రమే వేరే వాళ్ల సినిమాలు చూసే బాల‌య్య చాన్నాళ్ల త‌ర్వాత థియేట‌రుకు వ‌చ్చాడు. ఆ సినిమా మ‌రేదో కాదు.. కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ‌. ఎక్క‌డ చూశాడో ఏంటో తెలియ‌దు కానీ.. బాల‌య్య మాత్రం ఈ సినిమా చూశాడు. ఈ విష‌యాన్ని కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ నిర్మాత అనిల్ సుంక‌ర ట్విట్ట‌ర్లో వెల్ల‌డించాడు. లెజెండ్ (బాల‌య్య) త‌న అభిమాని లెజెండ్ (కృష్ణ‌గాడు)ను తెర మీద చూస్తున్నాడు. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. మాకంద‌రికీ ఇది చాలా సంతోషాన్నిచ్చే విష‌య‌మిది అని మంగ‌ళ‌వారం సాయంత్రం ట్వీట్ చేశాడు అనిల్‌.

బహుశా ప్ర‌సాద్ ల్యాబ్ లో బాల‌య్య‌కు స్పెష‌ల్ షో ఏమైనా వేస్తున్నారో ఏంటో కానీ.. త‌న‌తో లెజెండ్ సినిమా తీసిన నిర్మాత‌లు అడిగితే కాద‌న‌కుండా బాల‌య్య సినిమా చూస్తుండ‌టం విశేష‌మే. కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ‌లో బాల‌య్యను ఓ రేంజిలో వాడేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఐతే ఆ వాడకం బాల‌య్య‌కు, ఆయ‌న అభిమానుల‌కు కూడా సంతోషాన్నిచ్చేలాగానే ఉండ‌టం విశేషం. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విజ‌య‌యాత్ర చేస్తున్న కేవీపీజీ టీం.. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు నేప‌థ్యంగా ఎంచుకున్న అనంత‌పురం జిల్లాకు కూడా రాబోతోంది. ఆ జిల్లాలో ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు అభిమానులు.
Tags:    

Similar News