డిలే ప్రాజెక్ట్ దూసుకొచ్చేలా ఆ క్రేజీ కాంబో ప్లానింగ్!
ప్రస్తుతం సూర్య 45వ చిత్రం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. అయితే 46వ చిత్రంగా వెట్రీమారన్ ప్రాజెక్ట్ ఖరారైంది.
కోలీవుడ్ స్టార్ సూర్య 46వ చిత్రం ఫిక్సైందా? పెండింగ్ లో పడిన ప్రాజెక్ట్ నే 46గా ఫిక్స్ చేసారా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య 45వ చిత్రం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. అయితే 46వ చిత్రంగా వెట్రీమారన్ ప్రాజెక్ట్ ఖరారైంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే పట్టా లెక్కాలి. కానీ అనివార్య కారణాలతో డిలే అయింది.
కానీ ఇక ఆలస్యం అమృతం విషం అన్న చందంగా సూర్య ఈ ప్రాజెక్ట్ ని ఏమాత్రం డిలే చేయకుండా పట్టాలెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. వెట్రీమారన్ `వాడివాసల్` కి సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పటికే ఉంది. కానీ అదెప్పుడు సెట్స్ కి వెళ్తుంది అన్నది క్లారిటీ లేని నేపథ్యంలో తాజా సమాచారం అభిమానుల్లో జోష్ ని నింపింది. ఇందులో సూర్య తండ్రీ-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. రెండు పాత్రలు పోటా పోటీగా సాగుతాయట.
ఈ సినిమా షూటింగ్ 15 నెలలు పాటు సాగుతుందట. ఈ వేసవిలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారని సమాచారం. అంటే ఆర్జే బాలాజీ సినిమా షూటింగ్ తో పాటు, సూర్య వెట్రీమారన్ సినిమా చిత్రీకరణలో కూడా పాల్గొంటాడు. జల్లికట్టు క్రీడ నేపథ్యంలో సాగే వాడివాసలపై అంచనాలు ఎలా ఉన్నాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రీడకు తమిళనాడు లో ఎంతో ప్రత్యేకత ఉంది. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఆడే సంప్రదాయ క్రీడ ఇది.
తమిళ సాంప్రదాయ యుగానికి చెందినదిగా భావిస్తారు. పొంగల్ పండుగ సందర్భంగా ఏటా జనవరిలో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. ఇదే బ్యాక్ డ్రాప్ లో సూర్య సినిమా సాగుతుంది. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ లోనూ భారీ అంచనాలున్నాయి. మూగ జీవాలను హింసించే క్రీడ అంటూ నిషేధం విధించాలని కేంద్రం భావించినా పెద్ద ఎత్తున పోరాటం చేసి మరీ తమిళ ప్రజలు తమ హక్కును కాపాడుకున్నారు.