సమరసింహారెడ్డి.. నరసింహా నాయుడు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నందమూరి బాలకృష్ణ తో బి గోపాల్ తెరకెక్కించారు. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా అప్పట్లో బి గోపాల్ నిలిచాడు. కాల క్రమేనా ఆయన క్రేజ్ తగ్గింది. దాంతో ఆయన సినిమాల సంఖ్య తగ్గింది. ఈమద్య కాలంలో ఆయన సినిమాలే చేసింది లేదు. ఎట్టకేలకు బాలకృష్ణ తో మళ్లీ సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబో వార్తలు ఆమద్య జోరుగా వచ్చినా ఆ తర్వాత తర్వాత వీరి కాంబో మూవీ వార్తలు పుకార్లే అని అంతా అనుకున్నారు.
ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో సినిమా ఖచ్చితంగా ఉంది. మీడియాలో వస్తున్నట్లుగా వీరి కాంబో మూవీ క్యాన్సిల్ కాలేదు. ప్రస్తుతం సాయి మాధవ్ బుర్ర మరియు ఆకుల శివతో పాటు యంగ్ దర్శకులతో కలిసి బి గోపాల్ కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడు. బాలకృష్ణ ను ఈ సినిమాలో గోపాల్ స్పై పాత్రలో చూపించబోతున్నాడట. ఇదో మాంచి యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా నిలుస్తుందనే అభిప్రాయంను బి గోపాల్ వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన అప్ డేట్ అయితే ఏమీ లేదు. కాని త్వరలోనే సినిమా ప్రారంభించే అవకాశం అయితే ఉందని.. బాలయ్య స్పై గా దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు.